మనం మాయమైపోతామా..? డైనోసార్లలా అంతరించిపోతామా.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
మనం మాయమైపోతామా... ? డైనోసార్లలా అంతరించిపోతామా..? భవిష్యత్తులో ఈ భూమ్మీద బతికే జీవులు మనుషులు ఇలా ఉండేవారని బిగ్ స్క్రీన్‌లపై మనం డైనోసార్లను చూసినట్టు చూసుకోవాల్సిందేనా..? తాజాగా విడుదలైన జనన గణాంకాల నివేదిక... ఎందుకు.. ఈ తరానికి అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే చెబుతా.. బర్త్ రేట్ ఇండెక్స్‌ను చూస్తే ఇది భవిష్యత్తులో నిజం కానుందా అన్న అనుమానం రాక మానదు.

మనం మాయమైపోతామా… ? డైనోసార్లలా అంతరించిపోతామా..? భవిష్యత్తులో ఈ భూమ్మీద బతికే జీవులు మనుషులు ఇలా ఉండేవారని బిగ్ స్క్రీన్‌లపై మనం డైనోసార్లను చూసినట్టు చూసుకోవాల్సిందేనా..? కొద్ది రోజుల క్రితం విడుదలైన బర్త్ రేట్ ఇండెక్స్‌ను చూస్తే ఇది భవిష్యత్తులో నిజం కానుందా అన్న అనుమానం రాక మానదు. ఎక్కడి వరకో ఎందుకు… మన ఆసియాలో మనకు దగ్గర్లోనే ఉన్న దక్షిణ కొరియా తెలుసు కదా.. అభివృద్ధిలో ఆకాశంతో పోటీ పడే ఈ దేశం.. జననాల విషయంలో మాత్రం రోజు రోజుకీ అథఃపాతాళానికి దిగజారిపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న విడుదలైన గణాంకాలను చూస్తే 2022తో పోల్చితే 2023లో ఏకంగా 8శాతం నుంచి 0.72 శాతానికి జననాల రేటు పడిపోయింది. ఏ దేశమైనా స్థిరమైన వృద్ధి రేటు కొనసాగించాలంటే కనీసం జననాల రేటు 2.1శాతం ఉండాలి. దక్షిణ కొరియాలో ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి కొరియా జనాభా ప్రస్తుతమున్న సంఖ్యలో సగానికి తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు ఆ దేశం అంత ఆందోళన చెందుతోంది. ఇది కేవలం దక్షిణ కొరియాకు మాత్రమే పరిమితం కాలేదు. పక్కనే మరో సూపర్ పవర్ కంట్రీ జపాన్‌లోనూ అదే పరిస్థితి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏకంగా 5.1 శాతం పడిపోయింది. పెళ్లిళ్ల సంఖ్య కూడా అంతే. సంవత్సరం మొత్తంలో జపాన్‌లో కేవలం 4లక్షల 89 వేల 281 వివాహాలు మాత్రమే జరిగాయి. ఇంత దారుణంగా పడిపోవడం గత...
