Indian Railways: రైలు కోచ్‌ మొత్తాన్ని బుక్ చేసుకోవచ్చా.. IRCTC నిబంధనలు ఏం చెబుతున్నాయి.?

ఇక ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో రకాల సేవలను అధికారులు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. సాధారణంగా పెళ్లిళ్లకు మనం ప్రత్యేక బస్సులను బుక్‌ చేసుకుంటామనే విషయం తెలిసిందే. అయితే రైలు కోచ్‌ను కూడా బుక్‌ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.?

Indian Railways: రైలు కోచ్‌ మొత్తాన్ని బుక్ చేసుకోవచ్చా.. IRCTC నిబంధనలు ఏం చెబుతున్నాయి.?
Indian Railways
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 29, 2023 | 6:57 PM

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వేలు ఒకటి. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా ఇదే కావడం విశేషం. ప్రతిరోజూ లక్షలాది మందిని ఇండియన్‌ రైల్వేలు తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కేవలం ప్రయాణికులే కాకుండా వస్తువులను కూడా సరఫరా చేస్తున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది ఇండియన్‌ రైల్వే.

ఇక ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో రకాల సేవలను అధికారులు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. సాధారణంగా పెళ్లిళ్లకు మనం ప్రత్యేక బస్సులను బుక్‌ చేసుకుంటామనే విషయం తెలిసిందే. అయితే రైలు కోచ్‌ను కూడా బుక్‌ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.?

మొత్తం కోచ్‌ను బుకించ్‌ చేసుకోవడానికి రైల్వే ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. IRCTCని సంప్రదించడం ద్వారా మొత్తం కోచ్‌ని సులభంగా బుక్ చేసుకోవచ్చు. రైలు మొత్తం కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటే సాధారణ ఛార్జీల కంటే కనీసం 35 నుండి 40 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు.. మీరు రైల్వేలో భద్రతా రుసుమును కూడా డిపాజిట్ చేయాలి. ప్రయాణం ముగిసిన తర్వాత రైల్వే మీకు డిపాజిట్ చేసిన రుసుమును రీఫండ్ చేస్తుంది.

మొత్తం కోచ్‌ను బుక్ చేయాలనుకుంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం FTR సర్వీస్ ఎంపికను ఎంచుకోవాలి. దీని తర్వాత మీరు మీ IRCTC ఖాతాకు (IRCTC ఖాతా లాగిన్) లాగిన్ అవ్వాలి. దీని తర్వాత మొత్తం సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కోచ్ బుకింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రైలు కోచ్‌ను బుక్‌ చేసుకోవడానికి రూ. 50 వేలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక రైలు మొత్తాన్ని సైతం బుక్‌ చేసకోవచ్చు. 18 కోచ్‌లను బుక్‌ చేసుకోవాలంటే.. రూ.9 లక్షల వరకు చెల్లించాలి. దీనితో పాటు, మొత్తం రైలును బుక్ చేసిన తర్వాత, మీరు రైలుకు హాల్టింగ్ ఛార్జీగా రూ. 10,000 అదనపు రుసుమును చెల్లించాలి. రైలులో 18 కోచ్‌లను బుక్ చేయడంతో పాటు, మీరు 3 SLR కోచ్‌లను కూడా బుక్ చేసుకోవాలి.

మొత్తం కోచ్‌ని బుక్‌ చేసుకోవాలనుకుంటే.. మీరు కనీసం 2 నెలల ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయిఏ ఏదైనా కారణంతో కోచ్ బుకింగ్‌ను రద్దు చేస్తే, మీరు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రైలు బయలుదేరే 2 రోజుల ముందు వరకు మీరు బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!