Global Tiger Day: రాత్రుల్లో మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవు.. టైగర్స్‌ గురించి ఆసక్తికర విషయాలు..!

Global Tiger Day: పులి.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. పిల్లలు జంతువులను ఏ జూ పార్క్‌కు వెళ్లినా చూసి ఆనందపడతారు. కానీ పులిని చూస్తే షాక్‌ అవుతారు. అయితే..

Global Tiger Day: రాత్రుల్లో మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవు.. టైగర్స్‌ గురించి ఆసక్తికర విషయాలు..!
Interesting Facts About Tigers
Follow us
Subhash Goud

|

Updated on: Jul 29, 2021 | 6:10 AM

Global Tiger Day: పులి.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. పిల్లలు జంతువులను ఏ జూ పార్క్‌కు వెళ్లినా చూసి ఆనందపడతారు. కానీ పులిని చూస్తే షాక్‌ అవుతారు. అయితే రోజురోజుకు అంతరించిపోతున్న పులులను కాపాడే బాధ్యత అంతరిది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ (WWF) గత సంవత్సరం తెలిపిన వివరాల ప్రకారం… ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నది 3900 పులులే. వాటిలో 70 శాతం మన ఇండియాలోనే ఉన్నాయి. ఇంకో విషయమేంటంటే… ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, రష్యాలో… పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినప్పటికీ వాటి సంఖ్య చాలా తక్కువేనని చెప్పాలి. అయితే ప్రతి సంవత్సరం జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుతున్నారు. జంతు పరిశోధకులు, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ (WWF) తెలిపిన వివరాల ప్రకారం.. పులులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

➦ పులులు పుట్టిన తర్వాత ఎక్కువ కాలం తమ తల్లిదండ్రులపై ఆధారపడవు. తమకు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇష్టపడతాయి. రెండేళ్లు కాగానే విడిగా వెళ్లిపోతాయి. మగ పులులకు మూడేళ్ల ➦ తర్వాత సెక్సువల్ మెచ్యూరిటీ వస్తుంది. ఆడ పులులకు నాలుగేళ్ల తర్వాత అది వస్తుంది.

➦ పులులు 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అయితే షాకింగ్ విషయమేంటంటే.. పులి పిల్లలు పుట్టినప్పుడు వాటికి కళ్లు కనపడవట. తమ తల్లు నుంచి వచ్చే వాసనను బట్టీ తల్లిని అనుసరిస్తాయట. పులి పిల్లల్లో సగం ఆకలితో చనిపోతాయి. లేదా చలికి తట్టుకోలేక చనిపోతాయి. పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పిల్లలు చనిపోతాయని వైల్డ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ చెబుతోంది.

➦ ప్రతీ పులికి చారలు వేర్వేరుగా ఉంటాయి. మనుషుల్లో ఏ ఇద్దరికీ ఒకేలాంటి వేలి ముద్రలు ఉండనట్లే… ఏ రెండు పులులకూ ఒకేరకమైన చారలు ఉండవు.

➦ పులులు ఈదగలవు. ఆహారం కోసం చాలా దూరం ఈదుతూ వెళ్లగలవు. అవి ఎంతైనా సాహసం చేయగలవు. బెంగాల్ సుందర్‌బన్స్ అడవుల్లో… చాలా పులులు ఈదుతూ వెళ్లడాన్ని టూరిస్టులు చూస్తూ ఉంటారు. పైగా పులులకు నీటిలో ఆడుకోవడం చాలా ఇష్టం.

➦ సింహాలు గుంపులుగా జీవిస్తాయి. పులులు విడివిడిగా జీవిస్తాయి. ప్రతీ పులి తనకంటూ భారీ ప్రాంతాన్ని ఎంచుకుంటుంది. యూరిన్ పోయడం, మూత్ర విసర్జన చేయడం, అరవడం ద్వారా పులులు తమ ప్రాంతాన్ని డిసైడ్ చేస్తాయి.

➦ ఇంకో విషయం ఏంటంటే పులి ఉమ్మిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయని జంతు పరిశోధకులు చెబుతున్నారు. అందుకే పులులకు గాయాలైనప్పుడు అవి తమ నాలికతో గాయాన్ని రుద్దుకుంటాయి. ఆ లాలాజలం గాయాన్ని మాన్పించేలా చేస్తుంది.

➦ రాత్రిళ్లలో మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవని జంతు పరిశోధకులు చెబుతున్నారు. పులులు పగటి వేళ కంటే రాత్రివేళ బాగా వేటాడగలవు. అలాగని అవి పగటివేళల్లో వేటాడకుండా ఉండలేవు. పులులకు ముందు కాళ్ల కంటే వెనక కాళ్లు ఎక్కువ పొడవుగా ఉంటాయి. ఫలితంగా అవి ఒక్కో జంపుకీ ఎక్కువ దూరం గెంతగలవు. అలా గెంతుతున్నప్పుడు వాటికి ఉండే పొడవైన తోకతో అవి బ్యాలెన్స్ చేసుకుంటూ అటూ ఇటూ మలుపులు తిరుగుతుంటాయి.

➦ బాగా పెరిగిన పులి 140 కేజీల నుంచి 300 కేజీల దాకా ఉంటుంది. ఆడపులి ఒకేసారి 35 కేజీల ఆహారాన్ని భోజనంలా తినగలదు.

➦ పులుల పాదాల కింద మెత్తగా ఉంటుంది. అందువల్ల అవి నడిచేటప్పడు శబ్దం రాదు. ఫలితంగా అవి వేటాడేటప్పుడు… సైలెంట్‌గా వచ్చి పరుగెడుతాయి. పులులు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి.

ఇవీ కూడా చదవండి:

International Tiger Day: పులులను ఎలా లెక్కిస్తారు.. ఐదు పద్దతుల్లో గణాంకాలు.. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

Jagananna Vidya Deevena: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేడు జగనన్న విద్యా దీవెన రెండో విడత డబ్బులు జమ..!