AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Time Home Buyers:మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వినియోగదారులు తెలుసుకోవలసిన టాక్స్ బెనిఫిట్స్

ప్రతి మనిషి కల సొంత ఇల్లు.. తమ జీవితంలో సొంత ఇల్లు కొనుక్కోవాలని తమ కలను సాకారం చేసుకోవాలని భావిస్తారు. అయితే మొదటిసారి ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు..

First Time Home Buyers:మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వినియోగదారులు తెలుసుకోవలసిన టాక్స్ బెనిఫిట్స్
Surya Kala
|

Updated on: Jan 24, 2021 | 2:56 PM

Share

First Time Home Buyers: ప్రతి మనిషి కల సొంత ఇల్లు.. తమ జీవితంలో సొంత ఇల్లు కొనుక్కోవాలని తమ కలను సాకారం చేసుకోవాలని భావిస్తారు. అయితే సొంత ఇల్లు కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఇంటి కొనుగోలుపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఎలా పొందవచ్చును అనే అంశంపై అవగాహన పెంపొందించుకోవాలి. కొత్తగా ఇల్లు కొనుక్కునే వారు ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది మరి డీటైల్స్ ఏమిటో తెలుసుకుందాం..!

ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80ఈఈ కింద మీరు పన్ను మినహాయింపు పొందొచ్చు. హోమ్ లోన్‌ మొత్తంపై చెల్లించిన వడ్డీ పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరం లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షల పన్ను తగ్గింపునకు ఇది అదనం అన్నమాట. ఈ ప్రయోజనం హోమ్ లోన్ పూర్తిగా చెల్లించేంత వరకు ఉంటుంది. ఈ అవకాశం ఎవరికి ఉంటుంది అనే విషయానికి వస్తే… ఇంటి విలువ రూ.50 లక్షలకు లోపు ఉండాలి. ఇంటి కోసం తీసుకున్న రుణం రూ.35 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉండాలి. లోన్ కూడా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి తీసుకుంటేనే ఇది వర్తిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 24 కింద రూ.2 లక్షలు, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షలు కాకుండా మరో బెనిఫిట్ కూడా లభిస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80EE కింద మొదటి సారి ఇల్లు కొంటె రూ.50 వేల పన్ను మినహాయింపు పొందొచ్చు. జాయింట్ లోన్ తీసుకుంటే ఇద్దరూ హోమ్ లోన్ వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. సో సొంత ఇల్లు మొదటి సారిగా కొనుగోలు చేసే వారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Also Read: కూర్చున్న చోటే జాబ్.. క్యాండీలు రుచి చెప్పండి.. గంటకు రూ. 1700 లను సంపాదించుకోండి