Wild Edible Fruits: అడవిలో దొరికే ఈ పళ్ళలో ఆరోగ్య రహస్యాలు ఎన్నో.. ఎగబడుతున్న జనం..!
మనిషి జీవితానికి ప్రకృతికి విడదీయలేని అనుబంధం, ఆ ప్రకృతితో భాగమైన అడవులతో సహజీవనం చేయడం అనేది నిజంగా ఓ అదృష్టమనే చెప్పాలి. భద్రాద్రి ఏజెన్సీలోని గిరిజనులు అడవులతో మమేకమై జీవిస్తూ ఉంటారు. వీరి జీవిన శైలిలో అడవి ఓ ప్రధానమైన భాగం. అడవిలోకి వెళితే కానీ పూట గడవని పరిస్థితి వీరిది.. అయితే వారు తెచ్చే పళ్ళకు మాత్రం యమ గిరాకీ..!

గిరిజనులు తమ బ్రతుకు బండి లాగడం కోసం అడవుల ద్వారా లభించే అనేక ఫలాలను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని సందర్భాలలో అరుదైన పళ్ళను సేకరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో అరుదుగా లభించే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి బూసి పళ్ళను ప్రస్తుతం విక్రయిస్తున్నారు ఏజెన్సీలోని గిరిజనులు.
బూసి పళ్ళు ఇవి చాలా అరుదుగా లభించే ఫలాలు. వీటికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఫలాలు అందించే చెట్టు అన్ని చెట్లలాగా ఏడాది కొకసారి ఫలాలను ఇవ్వదు. ప్రకృతి సిద్ధంగా వాతావరణంలో ఏర్పడే మార్పుల ఆధారంగా ఈ చెట్టుకు కాయలు కాస్తాయి. అందుకు సమయం మూడేళ్ల నుండి ఐదేళ్ల వరకు తీసుకుంటుంది. వేసవికాలం తర్వాతే ఈ చెట్టు కాయలు పండ్లుగా మారుతాయి. ఈ బూసి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఒగరుగా, పండిన తర్వాత పుల్లగా ఉంటాయి. వీటి గింజలు బాదం జీడిపప్పు కంటే రుచిగా ఉంటాయి. పళ్లను చప్పరించిన తర్వాత వచ్చే గింజలను ఎండబెట్టి పప్పు తీస్తారు. గతంలో పప్పు ద్వారా నూనె తయారు చేసేవారని చెబుతారు. 20 ఏళ్ల క్రితమే ఈ నూనె ఖరీదు లీటర్ సుమారు రూ. 2000 వరకు ఉండేదట. దీనిలో ఉండే ఔషధ గుణాలు మనిషికి ఎంతో మేలు చేస్తాయని గిరిజనులు చెప్తున్నారు.
పినపాక ఏజెన్సీలో ప్రస్తుతం ఈ ఏడాది బూసి పండ్లు విరివిగా కాయడంతో బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు స్థానిక గిరిజనులు. మూడేళ్లతో ఒకసారి దొరికే ఈ అరుదైన బూసి పండ్ల గురించి తెలుసుకున్న ఎంతోమంది వీటిని కొనుక్కొని ఇంటికి తీసుకు వెళుతున్నారు. గత రెండు మూడు రోజులుగా ఈ పండ్లు మణుగూరులో విక్రయిస్తున్నారు స్థానిక గిరిజనులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…