Money Astrology: కేతువు మీద గురు దృష్టి.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. !

ఈ ఏడాదంతా కన్యారాశిలో సంచారం చేయబోతున్న కేతువు మీద ప్రస్తుతం గురు దృష్టి ఉన్నందువల్ల ఈ పాప గ్రహం చాలావరకు శుభ గ్రహంగా మారడం జరుగుతుంది. జీవితంలో ఆకస్మిక మార్పులకు కారకుడైన కేతువు ప్రస్తుతం గురు దృష్టితో అనుకూలంగా మారినందువల్ల ఆ రాశులకు శుభ ఫలితాలనివ్వబోతున్నాడు.

Money Astrology: కేతువు మీద గురు దృష్టి.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. !
Money Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 15, 2024 | 7:09 PM

ఈ ఏడాదంతా కన్యారాశిలో సంచారం చేయబోతున్న కేతువు మీద ప్రస్తుతం గురు దృష్టి ఉన్నందువల్ల ఈ పాప గ్రహం చాలావరకు శుభ గ్రహంగా మారడం జరుగుతుంది. జీవితంలో ఆకస్మిక మార్పులకు కారకుడైన కేతువు ప్రస్తుతం గురు దృష్టితో అనుకూలంగా మారినందువల్ల వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశులకు శుభ ఫలితాలనివ్వబోతున్నాడు. కేతువు స్థితిగతులను బట్టి ఈ రాశుల వారి జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కేతువు అనుకూలంగా లేని మిగిలిన రాశుల వారు దత్తాత్రేయ స్తోత్ర పఠనం లేదా గణపతి స్తోత్ర పఠనం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో మార్మిక గ్రహం కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఊహించని విధంగా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కలలో కూడా ఊహించని పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సృజనా త్మకత బాగా వృద్ధి చెందుతుంది. కొత్త నైపుణ్యాలలో ఆరితేరుతారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలి తాలనిస్తాయి. ఆశించిన శుభవార్తలను వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల మనసులోని కోరికలు చాలా భాగం నెరవేరుతాయి. జీవితాన్ని మలుపు తిప్పగల ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక పురోగతి ఉంటుంది. తప్పకుండా కొన్ని అదృష్టాలు, ధన యోగాలు పడతాయి. ఆస్తుల విలువ పెరగడం, సోదరులతో సఖ్యత మెరుగుపడడం, శుభవార్తలు ఎక్కువగా వినడం వంటివి జరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుతాయి.
  3. సింహం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న కేతువును దశమ స్థానం నుంచి గురువు వీక్షిస్తు న్నందు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని అభివృద్ధితో పాటు అంచనాలకు మించిన ఆదాయానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కేతువు మీదే కాక, ఈ రాశి మీద కూడా గురువు వీక్షణ పడి నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఊహించని విధంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు అంచనాలకు మించిన ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న కేతువు మీద పంచమ కోణం నుంచి గురు గ్రహ దృష్టి పడినందువల్ల సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. ఆర్థికంగానే కాక, వృత్తి, ఉద్యోగాలపరంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ జీవితంలో అకస్మాత్తుగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. రెండు మూడు సార్లు ధన యోగాలు పడతాయి.
  6. మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల, దాని మీద రాశ్యధిపతి గురు దృష్టి ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఊహించని విధంగా జీవన శైలి మారిపోతుంది. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా ఆదాయం దిన దినా భివృద్ధి చెందు తుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ద్వారా అదృష్టం లేదా సంపద బాగా కలిసి వస్తుంది.

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!