Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Tips: రోడ్డుపైన డబ్బులు దొరికితే ఏం చేయాలో తెలుసా.. ఇలా మాత్రం చేయకండి..

Astro Tips For Money: ఆ నాణెం లేదా డబ్బుతో ఏం చేయాలనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంటుంది. ఇక్కడే గందరగోళంతోపాటు అర్థం కాదు.. ఈ విషయం ఎవరిని ఎడిగితే బాగుంటుందో కూడా అర్థం కాదు. ఇలా దొరికినవాటని..

Money Tips: రోడ్డుపైన డబ్బులు దొరికితే ఏం చేయాలో తెలుసా.. ఇలా మాత్రం చేయకండి..
Coins On Road
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 26, 2023 | 4:02 PM

నాణేలు లేదా (డబ్బు) కరెన్సీ నోట్లు కొన్నిసార్లు మనం నడిచేటప్పుడు వీధుల్లో దొరుకుతాయి. అందులో రూపాయి నుంచి 10,20,50 దొరుకుతాయి. ఇలా దొరికిన డబ్బును ఏం చేయాలో మనలో చాలా మందికి అర్థం కాదు. ఇలా లభించిన డబ్బును ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. కొద్ది మంది ఇలా దొరికిన డబ్బును అదృష్టంగా భావిస్తారు. ఆ డబ్బు లేదా నాణేలను తమ జేబుల్లో వేసుకుంటారు. కొందరు ఆ నాణేలను నీటిలో విసిరివేస్తారు. చాలా మంది గుడిలోని హుండీలో కాని.. సమీపంలో ఎవరైనా బిక్షాటన చేసేవారికి కానీ.. ఆర్దికంగా అవసరం ఉందనుకున్నవారికి ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ప్రతి వ్యక్తికి తమ జీవితంలో ఒక్కోసారి జరుగుతుంటాయి.

నాణేలు కావచ్చు, నోటు కావచ్చు.. అయితే ఆ నాణేలు లేదా డబ్బుతో ఏం చేయాలనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఇక్కడే గందరగోళం తలెత్తుతోంది. ఎందుకంటే ఇతరుల సొమ్ము పాముతో సమానం అని.. దాన్ని వేరే చోట విరాళంగా ఇవ్వాలా ఏం చేయాలో అర్థం కాదు. వీధిలో పడి ఉంటే.. కొందరు దానిని ఎత్తుకొని తమ వద్ద దాచుకుంటారు. చాలా మంది దానిని ఆలయానికి విరాళంగా ఇస్తారు. కానీ, వీధిన పడ్డ డబ్బులు దాచుకుంటే మంచిదా? వీధిలో దొరికిన డబ్బును స్వంత ఖర్చులకు ఉపయోగించడం శుభమా లేదా అశుభమా? ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

ఇలాంటి డబ్బు తీసుకోవడం శుభమా, అశుభమా..

  • ముఖ్యంగా రోడ్డుపై పడి ఉన్న నాణేలను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, వీధిలో పడి ఉన్న నాణెం దొరకడం అంటే పూర్వీకుల ఆశీర్వాదం. ఆ డబ్బుతో శ్రద్ధగా ఏదైనా చేస్తే అందులో తప్పకుండా విజయం సాధించవచ్చు. చైనాలో ఇలా లభించిన డబ్బు లేదా నాణేలు లావాదేవీల రూపంగా మాత్రమే కాకుండా.. అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
  • వాస్తుశాస్త్రం ప్రకారం, మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతుంటే.. ఆ సమయంలో దారిలో పడి ఉన్న నాణెం లేదా నోటు కనిపిస్తే.. అది శుభప్రదం. మీరు చేయబోయే పనిలో ఇది విజయానికి మొదటి చిహ్నంగా కనిపిస్తుంది.
  • మీరు పని నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే.. దారిలో నాణేలు లేదా డబ్బు పడి ఉన్నట్లయితే.. అది కూడా మంచిది. మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని నమ్ముతారు.
  • మీరు వీధిలో కొంత డబ్బు పడి ఉంటే.. దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి లేదా మీ పర్సులో లేదా ఇంట్లో ఎక్కడైనా ఉంచండి. కానీ వాస్తు ప్రకారం దానిని అస్సలు ఖర్చు చేయకూడదు.
  • మీరు దారిలో నాణేలను పొందినట్లయితే, మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించబోతున్నారని అర్థం చేసుకోండి. ఈ పనిలో విజయం.. డబ్బు రెండూ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
  • అంతేకాదు ఇలా లభించిన డబ్బును జాగ్రత్తగా అవసరమైనవారికి ఇవ్వడం వల్ల వారి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం