నాన్న తాగొచ్చి కొడుతున్నాడు.. అమ్మను వేధిస్తున్నాడు.. పోలీసు స్టేషన్ మెట్లెక్కిన బాలిక
తల్లి పడుతున్న బాధలు చూడలేక ఆమె కుమార్తె కన్నీటిపర్యంతమవుతుంది. ఇక లాభం లేదని భావించి చివరికి..
నాన్న నిత్యం మద్యం తాగుతున్నాడు.. అమ్మతో గొడ వపడుతున్నాడు.. బ్రతిమాలినా వినడం లేదు.. కాళ్ల పై పడ్డాం అయినా కనుకరించలేదు.. అమ్మ చేసిక కష్టం తాగుడుకు ఖర్చు పెడుతున్నాడు.. అంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. వారిది రోజువారి పని చేసుకుంటే తప్పా పూట గడవని కుటుంబం. కష్టపడిన సంపాదించిన డబ్బులను కూడా తాగుడు కోసమే ఖర్చు పెడుతున్నాడు. దీంతో ప్రతిరోజూ ఇంట్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తండ్రి చేస్తున్న గొడువతో కుటుంబ సభ్యులు మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో తల్లి పడుతున్న బాధలు చూడలేక ఆమె కుమార్తె కన్నీటిపర్యంతమవుతుంది. ఇక లాభం లేదని భావించి చివరికి పోలీసులను ఆశ్రయించింది. తన తండ్రి తాగుడు అలవాటును మాన్పించాలని ఎస్ఐ నవతతో మొరపెట్టుకుంది.
వెంటనే స్పందించిన పోలీసులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకనైనా మారాలని హితవు పలికారు. ఇకపై ఎప్పుడు సమస్య వచ్చినా డయల్ 100కు సమాచారమిస్తే తానొస్తానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఎస్ఐ.
(సంపత్, టీవీ9 తెలుగు, కరీంనగర్)
Read also: నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. రైతులకు రుణమాఫీ జరగదు.. ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేసిన షర్మిల..