Pan Card: పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా ? ఈ విధంగా చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే మీ చెంతకు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ ఎంత అవసరమో.. పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. ఇక ఈ కార్డ్ కోసం అప్లై చేయాలంటే దరఖాస్తు పేజీలు నింపాలి. ఆ తర్వాత కార్డ్ వచ్చేంతవరకు వేచి
ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ ఎంత అవసరమో.. పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. ఇక ఈ కార్డ్ కోసం అప్లై చేయాలంటే దరఖాస్తు పేజీలు నింపాలి. ఆ తర్వాత కార్డ్ వచ్చేంతవరకు వేచి చూడాలి. అత్యవరస పరిస్థితిల్లో కూడా కార్డు పొందలేం. ఇక నుంచి పాన్ కార్డు పొందాలంటే ఈ కష్టాలేం పడాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని కేవలం పది నిమిషాల్లో పాన్ కార్డు పొందవచ్చు.
ప్రస్తుత కాలంలో పాన్ కార్డు అవసరానికి అనుగుణంగా ఆదాయపు పన్ను శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇన్స్టంట్ పాన్ సౌకర్యం కింద ఆధార్ కార్డు ద్వారా ఈ-పాన్ కార్డు ఇవ్వడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. పాన్ కార్డును ఎస్ఎస్డీఎల్, యూటీఐటీఎస్ఎస్ వెబ్‌సైట్స్‌లలో కూడా పొందవచ్చు. కానీ వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేయడానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పాన్ కార్డు ఎలా అప్లై చేయాలో మీకోసం..
పాన్ కార్డుకు అప్లై చేయడం.. ☞ ముందుగా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ☞ ఆ తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఉన్న క్విక్ లింక్స్‌లో Instant pan through aadhar లింక్ పై క్లిక్ చేయాలి. ☞ అందులో Get new pan అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ☞ ఆ తర్వాత అందులో మీ ఆధార్ నంబర్ టైప్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ☞ ఆ తర్వాతా ఓటీపీని ఎంటర్ చేసి, పేజీలో కనిపించే ఆధార్ వివరాలను చెక్ చేసుకోని ఓకే చేయాలి. ☞ ఇక మీ ఆధార్ కార్డుతో ఉన్న మీ ఈ-కేవైసీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చేరుతుంది. ☞ అనంతరం మీకు ఇన్‌స్టాంట్ ఈ పాన్ కార్డు లభిస్తుంది. ఇలా చేయడానికి కేవలం పది నిమిషాల సమయం పడుతుంది. ☞ అప్లై చేసిన తర్వాత మీకు పీడీఎఫ్ ఫార్మాట్లో పాన్ కార్డ్ లభిస్తుంది. వెంటనే ఆ దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. ☞ ఆ తర్వాత ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఈ-మెయిల్ ఐడీకి పాన్ కార్డు సాఫ్ట్ కాపీ వస్తుంది. అంతే కేవలం పది నిమిషాల్లోనే మీ పాన్ కార్డు మీకు చేరుతుంది.
Also Read:
What’s app privacy status: ప్రైవసీ రూల్స్‌పై మరోసారి వివరణ.. వైరల్ అవుతున్న వాట్సప్ కొత్త స్టేటస్..
What’s App: సిగ్నల్ యాప్‌కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..