Medaram: భక్తి పారవశ్యంలో కుటుంబం.. ఏకంగా పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం మొక్కులు
తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమ గా చూసుకున్నారు. ఆ శునకం కూడా వారి కుటుంబంలో ఒక మెంబర్‌లా కలిసి పోయింది. ఒక్కసారిగా ఆ పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యం బారిన పడింది. చనిపోతుందనే భయపడ్డారు. ఏమి జరుగుతుందో అనే ఆందోళన చెందారు. కానీ వారి మొక్కులు ఫలించాయి. మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో తన పెంపుడు కుక్కకు నిలువెత్తున బంగారం (బెల్లం)సమర్పించి మొక్కు తీర్చుకున్నారు భక్తురాలు స్వప్న, నగేష్ దంపతులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన నగేష్, స్వప్న దంపతులు. వీరు ఒక కుక్కకు స్లైసీ అని పేరు పెట్టుకుని పెంచుకుం,టూ తన ఇంట్లో తమ పిల్లవాడిగా భావించుకుంటూ పోషించుకుంటున్నారు. గత వారం రోజులు నుండి కుక్కకు తీవ్రమైన అనారోగ్యం గురికావడంతో, చనిపోతుంది అనుకున్న దశలో తమ ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మను నగేష్, స్వప్నలు వేడుకున్నారు. తమ శునకం ప్రాణాలు దక్కాలని, చావు బతుకుల మధ్య ఉన్న కుక్క కోలుకొని ఆరోగ్యంతో ఉండాలని.. అలా జరిగితే కుక్కకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుని మేడారం వస్తామని అమ్మవారిని ప్రార్థించారు. అంతే కుక్క బతికి బయటపడిందట.
దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సమ్మక్క సారక్క దయతోనే తమ పెంపుడు కుక్క బ్రతికిందని, కుక్క అయిన స్పైసీ కి నిలువెత్తు బంగారం(బెల్లం)సమ్మక్క సారక్క సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. .వారి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఇదంతా అమ్మవారి దయ అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…