Electric toothBrush: పళ్లు తోముకోడానికి కూడా ఎలక్ట్రిక్ బ్రష్ ఉందని తెలుసా? అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి
మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ బ్రష్‌లు ఎంట్రీ ఇచ్చాయి. మనలో చాలా మంది ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఎలక్ట్రిక్ బ్రష్‌ల గురించి చూస్తూ ఉంటాం. అయితే అవి ఎలా పని చేస్తాయో? అనే అనుమానంతో వాటి జోలికి వెళ్లం.

ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. రోజు వారి పనుల్లో యంత్రాల వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆడవాళ్లు ఇంటి పనులు యంత్రాలు చేసే సమయంలో మెషీన్ల ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందరం ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం? కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుగుకుంటాం. అంటే పళ్లు శుభ్రం చేసుకుంటాం. అయితే వివిధ రోగాలకు పళ్లు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతుంటారు. పళ్లు తోముకునే విషయంలో డెంటిస్ట్‌లు పలు సూచనలు చేస్తారు. కాబట్టి వారు చెప్పిన విధంగా తోముకున్నా నోటి సమస్యలు వేధిస్తున్నాయని కొందరు బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ బ్రష్‌లు ఎంట్రీ ఇచ్చాయి. మనలో చాలా మంది ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఎలక్ట్రిక్ బ్రష్‌ల గురించి చూస్తూ ఉంటాం. అయితే అవి ఎలా పని చేస్తాయో? అనే అనుమానంతో వాటి జోలికి వెళ్లం. ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్రష్‌లు ఎలా పని చేస్తాయో? ఓ సారి తెలుసుకుందాం.
సాధారణ టూత్ బ్రష్‌లో సన్నని బ్రిస్టల్స్ ఉన్నట్లుగానే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లో కూడా ఈ బ్రిస్టల్స్ వస్తాయి. మనం టూత్ బ్రష్‌ను ఆన్ చేసినప్పుడు, ఈ బ్రిస్టల్స్ కంపించి మీ దంతాల చుట్టూ తిరుగుతాయి, ఇది దంతాల నుంచి మురికిని తొలగిస్తుంది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లో టైమర్ సదుపాయం కూడా అందించబడుతోంది, దీనిలో మీరు మీ దంతాలను ఎంతసేపు బ్రష్ చేయాలో సెట్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ బ్రష్‌తో బ్రష్ చేసినప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు దంతాల ముందు మాత్రమే తీసుకోవాలి. ఇది ఆన్ చేసిన వెంటనే, దానంతట అదే దంతాలను శుభ్రపరచడం ప్రారంభిస్తుంది. అలాగే సాధారణంగా ఎలక్ట్రిక్ బ్రష్ ధర రూ.800 నుంచి రూ.2000 వరకూ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయంలో ఏంటంటే బ్రష్‌కు పేస్ట్ పెట్టాక నోట్లో పెట్టిన తర్వాత మాత్రమే ఆన్ చేయాలి. ఎందకంటే ముందుగానే ఆన్ చేస్తే దానికి అప్లై చేసిన పేస్ట్ పడిపోతుంది.
ఎలక్ట్రిక్ బ్రష్ వాడడం ప్రయోజనకరమేనా?
సాధారణంగా మనం వాడే బ్రష్ రూ.40 నుంచి రూ.50 వరకూ ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ బ్రష్ అయితే రూ. 2000 వరకూ ఉంటుంది. మీకు రేట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఎలక్ట్రిక్ బ్రష్‌ను వాడుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎలక్ట్రిక్ బ్రష్‌తో బ్రషింగ్ చేయిస్తే వారికి నోటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీని ద్వారా బ్రషింగ్ విషయంలో తల్లిదండ్రులకు సమయం కూడా ఆదా అవుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







