Dreams: ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు కల వస్తుందా.? ఏం జరుగుతుందంటే..
అయితే ఇలా ఎత్తైన ప్రదేశం నుంచి పడుతున్నట్లు కలలు వస్తే ఏం జరుగుతుంది.? ఎలాంటి అసలు ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి.? ఇది దేనికి సూచన వంటి. విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు కలలు రావడం సహా కొన్ని కలలు సాధారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. కొండ పైనుంచి పడిపోయినట్లు.. మంచు మీద నుంచి జారి కింద పడినట్లు కలలు వస్తుంటాయి...

రాత్రి నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని కలలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. భయానక కలలతో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంటాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంటాం. ఇలాంటి కలలో ఎత్తైన ప్రదేశాల నుంచి పడుతున్నట్లు కూడా కొన్ని సందర్భాల్లో కలలు వస్తుంటాయి.
అయితే ఇలా ఎత్తైన ప్రదేశం నుంచి పడుతున్నట్లు కలలు వస్తే ఏం జరుగుతుంది.? ఎలాంటి అసలు ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి.? ఇది దేనికి సూచన వంటి. విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు కలలు రావడం సహా కొన్ని కలలు సాధారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. కొండ పైనుంచి పడిపోయినట్లు.. మంచు మీద నుంచి జారి కింద పడినట్లు కలలు వస్తుంటాయి.
మనలో చాలా మంది ఇలాంటి కలలు ఎదుర్కోవడం సర్వసాధారణమైన విషయం. సాధారణంగా ఇలాంటి కలలు నిద్రకు సంబంధించిన రుగ్మతలు, ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కారణంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొండపై నుంచి ఎవరైనా నెట్టినట్లు అనిపించినా, అనుకోకుండా కొండపై నుంచి పడిపోవడం వంటి కలలు వస్తుంటే మీలో ఆత్మ విశ్వాసం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక పడిపోతున్నట్లు నిత్యం కలలు వస్తే మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి కలలు నిత్యం వేధిస్తుంటే.. ఒత్తిడిని తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెడిటేషన్, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. పడకగదిలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. ఇక దీర్ఘకాలంగా కలలు వేధిస్తుంటే.. ఒత్తిడి లేదా నిద్రలేమికి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. ఇక మానిసికంగా ఎంత ప్రశాంతంగా ఉన్నా కలు వేధిస్తుంటే మాత్రం.. మానసిక వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




