AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: ఐరోపాలో విస్తరిస్తోన్న చైనాలోని మిస్టరీ వ్యాధి.. డ్రాగన్ కంట్రీ నిజం చెప్పడం లేదంటూ ఆరోపణలు

చైనాలో భారీ సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తున్న ఈ మిస్టరీ వైరస్ క్రమంగా ఇతర దేశాల్లో వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఐర్లాండ్ లో వెలుగులోకి రాగా యూరప్‌లోని కొన్ని దేశాల్లో క్రమంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది.  నెదర్లాండ్స్‌తో సహా కొన్ని దేశాల్లో శ్వాసకోశ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. తాజా పరిస్థితుల్లో చైనాలోని మిస్టరీ వ్యాధి యూరప్ దేశాల్లోనూ వ్యాపిస్తోందా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

China: ఐరోపాలో విస్తరిస్తోన్న చైనాలోని మిస్టరీ వ్యాధి.. డ్రాగన్ కంట్రీ నిజం చెప్పడం లేదంటూ ఆరోపణలు
China Wuhan Disease
Follow us
Surya Kala

|

Updated on: Dec 01, 2023 | 8:44 PM

దాదాపు మూడేళ్ళ క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ గురించి ప్రపంచానికి చెప్పకుండా ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలిసిందే.. మళ్ళీ చైనాలోని వుహాన్‌లో సరికొత్త వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాధి గురించి త్వరలో మరింత సమాచారం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి, ఈ రకమైన వ్యాధి ఐరోపాలోని కొన్ని దేశాలలో కూడా వ్యాపించింది. అటు వంటి పరిస్థితిలో వీలైనంత త్వరగా యూరప్ నుండి కొంత డేటా వస్తుందని.. అది ఉపయోగకరంగా ఉంటుందని భారతదేశం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఎయిమ్స్‌లోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ టీవీ9తో మాట్లాడుతూ చైనాలో ప్రబలుతున్న ఈ వ్యాధి గురించి పెద్దగా సమాచారం అందడం లేదని అన్నారు. అటువంటి పరిస్థితిలో యూరప్‌లో విస్తరిస్తున్న వ్యాధి భారత్ కు కొత్త ఆశాకిరణాన్ని తెస్తోందని అన్నారు.

ఐరోపాలోని ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే

చైనాలో భారీ సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తున్న ఈ మిస్టరీ వైరస్ క్రమంగా ఇతర దేశాల్లో వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఐర్లాండ్ లో వెలుగులోకి రాగా యూరప్‌లోని కొన్ని దేశాల్లో క్రమంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది.  నెదర్లాండ్స్‌తో సహా కొన్ని దేశాల్లో శ్వాసకోశ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. తాజా పరిస్థితుల్లో చైనాలోని మిస్టరీ వ్యాధి యూరప్ దేశాల్లోనూ వ్యాపిస్తోందా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

యూరప్ డేటాను విశ్వసించండి

డాక్టర్ సంజయ్ రాయ్ మాట్లాడుతూ యూరప్‌లోని సైంటిఫిక్ కమ్యూనిటీకి ఈ వ్యాధిపై అవగాహన వచ్చిందన్నారు. అసలు ఈ వ్యాధి ఏమిటి.. సాధారణ ప్రజలను శ్వాసకోశ వ్యాధి ఎందుకు ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అక్కడ పరిశోధనలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. జబ్బులను దాచుకునే అలవాటు యూరొపియన్లకు లేదన్నారు. అటువంటి పరిస్థితిలో యూరోప్ దేశాల డేటా ఆధారంగా తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేయవచ్చని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మిస్టరీ వైరస్ పై భారత్ లో అవేర్నెస్

డాక్టర్ సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. చైనా మిస్టరీ వ్యాధి కారణంగా సామాన్య భారతీయుల మదిలో  భయాందోళన వాతావరణం నెలకొందన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ శకం మళ్లీ వస్తుందా లేదా అనే సందేహం అందరిలోనూ కలుగుతుందన్నారు. ఈ అపోహలన్నింటినీ తొలగించడానికి AIIMS సంస్థలు రానున్న కొద్ది రోజుల్లో పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.

చైనా ఇప్పటికీ నిజం చెప్పడం లేదు

ఈ సంవత్సరం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్య చైనాలోని వుహాన్‌లో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. శ్వాసకోశ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువగా చిన్న  పిల్లలు ఉన్నారు. అయితే ఇప్పుడు పిల్లల తర్వాత, వృద్ధులను కూడా ప్రభావితం చేయడం ప్రారంభించింది. చైనా పదేపదే దీనిని సాధారణ వ్యాధి అని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇప్పటికే డేటాను పంచుకుంది.

చైనా డేటాను నమ్మవద్దన్న శాస్త్రవేత్తలు

చైనా అందించే డేటాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. చైనా ఈ రహస్య వ్యాధిని కొన్నిసార్లు వైరస్ అని కొన్నిసార్లు బ్యాక్టీరియా వంటి రకరకాలుగా అభివర్ణిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శ్వాసకోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చైనా సాధారణ వ్యాధిగా పిలుస్తున్నది. అయితే ఈ వ్యాధిని గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..