Fog: చలికాలంలో పొగమంచు ఎందుకు ఏర్పడుతుందో తెలుసా.?
పొగమంచు అనేది ఒక రకమైన నీటి ఆవిరి. సాధారణంగా గాలిలో రకరకాల వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనినే మనం తేమ అంటుంటాం. అయితే గాలిలో తేమ అనేది వాతావరణంలో ఉండే గాలి పీడనం, ఉష్ణోగ్రతలపై ఆధారపడింది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమ కరిగిపోతుంది...

ప్రస్తుతం చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో ఉదయం నిద్ర లేవాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు నిండి ఉంటుంది. దీంతో వాహనాలు, రైళ్లు, విమానాలు నడవడానికి ఇబ్బందిగా మారుతోంది. పొగమంచు కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే అసలు శీతాకాలంలో పొగమంచు ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.? చలికి, పొగ మంచుకు కారణంగా ఏంటి.? చలికాలంలోనే మంచు ఎక్కువగా ఎందుకు కురుస్తుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పొగమంచు అనేది ఒక రకమైన నీటి ఆవిరి. సాధారణంగా గాలిలో రకరకాల వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనినే మనం తేమ అంటుంటాం. అయితే గాలిలో తేమ అనేది వాతావరణంలో ఉండే గాలి పీడనం, ఉష్ణోగ్రతలపై ఆధారపడింది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమ కరిగిపోతుంది. అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే గాలిలో తేమ శాతం అలాగే ఉంటుంది.
సాధారణంగా శీతాకాలం సూర్య కిరణాలు ఆలస్యంగా వస్తాయి. దీంతో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో అది పొగమంచులా కనిపిస్తుంది. గాలిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతే.. గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. అదే పొగమంచు. ఈ సూక్ష్మబిందువులపై పడే కాంతి వివర్తనం చెంది అన్ని వైపులకు ప్రసరిస్తుంది. అందువల్ల అన్నీ కలిసి పొగలాగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా చలికాలంలో ఉంటుంది.
ఇక వింటర్‌లో రాత్రుళ్లు భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..