T-Shirt: టీ షర్టులో ‘టీ’ అంటే ఏంటో తెలుసా.? పెద్ద చరిత్రే ఉందండోయ్..
టీ షర్ట్స్ తక్కువగా ఉండడం వీటి వినియోగం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇదంతా ఇలా ఉంటే అసలు టీ షర్టుకు ఆ పేరు ఎలా వచ్చింది. టీ షర్టులో 'టీ' అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెనకాల పెద్ద చరిత్ర కూడా ఉంది. ఇంతకీ టీ అంటే ఏంటి.? దీనివెనకాల ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కంఫర్ట్‌గా ధరించే డ్రస్‌లలో టీ షర్ట్స్ ప్రధానమైనవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేవు. ఉతకడం, ఉపయోగించడం చాలా సులభంగా ఉంటాయి. అలాగే చిన్నారుల నుంచి పెద్దల వరకు పురుషుల నుంచి మహిళలల వరకు ఎవరైనా ధరించేందుకు వీలు ఉండడం వల్ల టీ షర్టులకు ఆదరణ ఎక్కువగా లభిస్తుంది.
ఇక ధర విషయంలో కూడా టీ షర్ట్స్ తక్కువగా ఉండడం వీటి వినియోగం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇదంతా ఇలా ఉంటే అసలు టీ షర్టుకు ఆ పేరు ఎలా వచ్చింది. టీ షర్టులో ‘టీ’ అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెనకాల పెద్ద చరిత్ర కూడా ఉంది. ఇంతకీ టీ అంటే ఏంటి.? దీనివెనకాల ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
టీ షర్టులో టీ అనే పదం రెండు రకాలుగా వచ్చిందని చెబతుంటారు. ఇందులో మొదటిది.. టీ షర్టు ఆకారాన్ని గమనిస్తే ‘టీ’ ఆకారంలో ఉంటుంది. బహుశా అందుకే టీ షర్టు పేరు వచ్చిందని అభిప్రాయపడుతుంటారు. ఇక టీ షర్టులో టీకి మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం.. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన సైనికులు శిక్షణ సమయంలో కంఫర్ట్‌గా ఉండేందుకు వెరైటీగా డిజైన్ చేసిన షర్ట్స్‌ను ఉపయోగించారు.
శిక్షణ (ట్రైనింగ్) సమయంలో ధరించిన షర్ట్స్ కాబట్టి టీ షర్ట్స్‌గా పేరు వచ్చినట్లు మరో అభిప్రాయం ప్రాచుర్యంలో ఉంది. కాలక్రమేణ శిక్షణకు ఉపయోగించిన వాటినే కంఫర్ట్‌గా ఉన్నాయన్న ఉద్దేశంతో ఎక్కువగా ధరించేవారటా. అలా టీ షర్టులుగా పేరు స్థిర పడింది. ఒకప్పుడు టీ షర్ట్స్ కేవలం తెలుపు రంగులోనే ఉండేవంటా.. కానీ కాలక్రమేణ రకరకాల రంగులతో పాటు, బొమ్మలు ప్రింటింగ్‌తో టీ షర్టులు మార్కెట్లో సందడి చేయడం ప్రారంభమయ్యాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




