Happy Zodiac Signs: అనుకూల స్థితిలో శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి సుఖ సంతోష యోగాలు పక్కా.. !
సుఖ సంతోషాలకు ప్రధాన కారకుడు శుక్రుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడికి తగ్గట్టుగా పరిస్థితులు అనుకూలించి, సుఖ సంతోషాలను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల సత్తా ఉంటుంది. ముఖ్యంగా సానుకూల దృక్పథంతో వ్యవహరించే అలవాటు ఉంటుంది.

తమకు సుఖపడే యోగం ఉందా అన్న ప్రశ్నకు చాలామందికి కలుగుతుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం జాతక చక్రం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కానీ, గ్రహ సంచారం ప్రకారం కూడా ఇందుకు చాలావరకు అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాలకు ప్రధాన కారకుడు శుక్రుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడికి తగ్గట్టుగా పరిస్థితులు అనుకూలించి, సుఖ సంతోషాలను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల సత్తా ఉంటుంది. ముఖ్యంగా సానుకూల దృక్పథంతో వ్యవహరించే అలవాటు ఉంటుంది. ప్రస్తుత గ్రహచారం ప్రకారం ఏడు రాశులకు శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉంది. అవిః మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, కుంభం.
- మేషం: సప్తమ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహాపురుష యోగమనే యోగం ఏర్పడింది. సాధారణంగా అధికార సంబంధమైన, సంసార సంబంధమైన సమస్యలు ఎక్కువగా బాధపడే ఈ రాశివారికి మాలవ్య యోగం కారణంగా ఈ సమస్యలు సునాయాసంగా పరిష్కారం అయి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు పీడించే అవకాశం లేదు. శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉండడానికి, సుఖం పొందడానికి బాగా అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలకు లేదా పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉన్న ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఈ సమస్యలను అధిగమిస్తారని చెప్పవచ్చు. వీరి తెలివితేటలు వికసించడం, సృజనాత్మకత పెరగడం వల్ల ఈ రాశి వారు సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, సుఖ సంతోషాలను కూడా మెరుగుపరచుకుంటారు.
- కర్కాటకం: ఈ రాశివారికి చతుర్థ కేంద్రంలో స్వస్థానంలో శుక్ర గ్రహ సంచారం జరుగుతున్నందువల్ల వీరికి కూడా మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఫలితంగా వీరు తప్పకుండా అనేక విధాలుగా సుఖ సంతోషాలను అనుభవించడం జరుగుతుంది. సాధారణంగా కుటుంబ వ్యవహారాలతో, మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడే ఈ రాశివారికి వీటి నుంచి ఆశించిన దానికంటే ఎక్కువగా విముక్తి లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా రకరకాలుగా సుఖ సంతోషాలు పొందడం జరుగుతుంది.
- తుల: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా, ఈ రాశివారు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి తప్పకుండా బయటపడడం జరుగుతుంది. కొద్దిపాటి ప్రయ త్నంతో వీరికి సమస్యల పరిష్కారంతో పాటు, అంచనాలకు మించిన సుఖ యోగం కూడా పట్టే అవకాశం ఉంది. విలాస జీవితంలో మునిగి తేలడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
- ధనుస్సు: ఈ రాశివారికి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల, సంపద కలిసి రావడం వల్ల ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా తొలగి పోతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దాంపత్య జీవితం ఎంతో హ్యాపీగా సాగిపోతుంది.
- మకరం: ఈ రాశివారికి దశమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఫలితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చిక్కులు, సమస్యలు సునాయాసంగా పరిష్కారం అయిపోతాయి. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఎటువంటి సమస్యనైనా తేలికగా తెలివితేటలతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకో గలుగుతారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గి, క్రమంగా ఆదాయం పెరగడం వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది.
- కుంభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సమస్యలు, వృత్తి సమస్యలు అప్రయత్నంగా కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యో గంలో బరువు బాధ్యతల వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉండడం వల్ల, ప్రోత్సాహ కాలు లభించడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా హ్యామీగా గడిచిపోతుంది.



