Dream: తెల్లవారు జామున ఈ కలలు వస్తున్నాయా.? మీ సుడి మారుతున్నట్లే అర్థం..

కలలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని మతాల్లోనూ కలల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం శాస్త్రాలే కాకుండా సైన్స్ కూడా కలలకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెబుతుంది. మన ఆధీనంలో లేకుండా వచ్చే కలలు మన వాస్తవిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చాలా మంది విశ్వాసం. మరీ ముఖ్యంగా... .

Dream: తెల్లవారు జామున ఈ కలలు వస్తున్నాయా.? మీ సుడి మారుతున్నట్లే అర్థం..
Dream Meaning
Follow us

|

Updated on: Aug 11, 2024 | 9:45 PM

కలలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని మతాల్లోనూ కలల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం శాస్త్రాలే కాకుండా సైన్స్ కూడా కలలకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెబుతుంది. మన ఆధీనంలో లేకుండా వచ్చే కలలు మన వాస్తవిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చాలా మంది విశ్వాసం. మరీ ముఖ్యంగా బ్రహ్మ ముహుర్తం సమయంలో, అంటే.. వేకువజామున వచ్చే కలలకు మరింత ప్రత్యేకత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేకువ జామున వచ్చే కలలో కొన్ని రకాల అంశాలు కనిపిస్తే అది శుభసూచికమని చెబుతున్నారు. ఇంతకీ ఆ కలలు ఏంటి.? వారి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తెల్లవారు జామున వచ్చే కలలో ధాన్యం కుప్ప కనిపించినా లేదా మీ కలలో ధాన్యం కుప్పపైకి ఎక్కినా మీ పంట పండబోతోందని అర్థం చేసుకోవాలి. మీకు ఏదో భారీ ఆర్థిక ప్రయోజనం కలగబోతోందని అర్థం. ధాన్యం సంపదకు నిదర్శనం. అలాంటి ధాన్యం కలలో కనిపిస్తే మీకు ఆర్థికంగా ఢోకా ఉండదు.

* తెల్లవారు జామున నవ్వుతున్న పాప కలలో కనిపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం.

* నదిలో స్నానం చేస్తున్నట్లు కనుక కల వస్తే.. మది కూడా మంచి కలగా భావించాలి. లేదంగా నీటిలో మునిగిపోతున్నట్లు కనిపించినా శుభప్రదంగా భావించాలి. ఇలాంటి కల వస్తే మీరు గతంలో కోల్పోయిన మీ సొత్తును తిరిగి పొందనున్నారని అర్థం. ఆర్థికంగా బలోపేతం కానున్నారని అర్థం చేసుకోవాలి.

* ఇక వేకువజామున వచ్చే కలలో నీటితొట్టె లేదా నీటి కొలను కనిపించినా అది చాలా శుభసూచకంగా భౄవించాలని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం కలలో ఇలా కనిపిస్తే ఆర్థికంగా బలోపేతంకానున్నారని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఏదో ఆస్తి లాభం పొందనున్నారని భావించాలి.

* విరిగిన దంతాలను కూడా శుభప్రదంగా భావించాలని పండితులు చెబుతున్నారు. సాధారణంగా దంతాలు విరగడం చెడుకు సంకేతం కావొచ్చనే భావనలో ఉంటాం. అయితే వాస్తవం మాత్రం అలా కాదు. ఇలాంటి కల వస్తే మీరు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి స్థానానికి చేరుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెల్లవారు జామున ఈ కలలు వస్తున్నాయా.? మీ సుడి మారుతున్నట్లే అర్థం.
తెల్లవారు జామున ఈ కలలు వస్తున్నాయా.? మీ సుడి మారుతున్నట్లే అర్థం.
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
రెండు శుభ యోగాలతో ఆ రాశుల వారికి సంపద వృద్ధి
రెండు శుభ యోగాలతో ఆ రాశుల వారికి సంపద వృద్ధి
రాజస్థాన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెకేషన్.. ఫొటోస్ చూశారా?
రాజస్థాన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెకేషన్.. ఫొటోస్ చూశారా?
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
చాలా అవకాశాలు కోల్పోయాను.. మృణాల్
చాలా అవకాశాలు కోల్పోయాను.. మృణాల్
మేడపై ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా చాలా నష్టపోతారు..
మేడపై ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా చాలా నష్టపోతారు..
వయనాడ్ బాధితుల కోసం హీరోయిన్ సంయుక్త ఏం చేసిందో తెలుసా?
వయనాడ్ బాధితుల కోసం హీరోయిన్ సంయుక్త ఏం చేసిందో తెలుసా?
అలా డ్రైవ్ చేసే వారికి.. ట్రాఫిక్‌ కెమెరా చూస్తోంది. జైలు తప్పదు!
అలా డ్రైవ్ చేసే వారికి.. ట్రాఫిక్‌ కెమెరా చూస్తోంది. జైలు తప్పదు!