Dreams: కలలో అందమైన అమ్మాయి కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలు రావడం సర్వ సాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని కలలు మనకు మంచి అనుభూతిని కలిగిస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. రాత్రుళ్లు ఉలిక్కిపడేలా చేస్తాయి. అయితే భయపెట్టేవన్నీ చెడు కలలు కాదని, మంచి అనుభూతిని ఇచ్చేవన్నీ మంచి కలలు కాదని కలల శాస్త్రం చెబుతోంది...

కలలు రావడం సర్వ సాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని కలలు మనకు మంచి అనుభూతిని కలిగిస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. రాత్రుళ్లు ఉలిక్కిపడేలా చేస్తాయి. అయితే భయపెట్టేవన్నీ చెడు కలలు కాదని, మంచి అనుభూతిని ఇచ్చేవన్నీ మంచి కలలు కాదని కలల శాస్త్రం చెబుతోంది. స్వప్న శాస్త్రంలో కలలకు సంబంధించిన వివరాలను స్పష్టంగా వివరించారు. అలాంటి వాటిలో రాత్రుళ్లు అందమైన అమ్మాయిలు కనిపించడం ఒకటి. ఇంతకీ కలలో అమ్మాయిలు కనపిస్తే దేనికి సంతకేమో ఇప్పుడు తెలుసుకుందాం..
* కలలో అందమైన అమ్మాయి కనిపిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఇలాంటి కలలు వస్తుంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం.
* ఇక కలలో పొడుగ్గా ఉన్న అందమైన అమ్మాయి కనిపిస్తే మీరు ఏదో శుభవార్త విననున్నారని అర్థం. ముఖ్యంగా కెరీర్‌లో విషయంలో నెలకొన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.
* ఒకవేళ కలలో బాలికలు కనిపిస్తే లక్ష్మీ కాటాక్షం మీపై ఉందని అర్థం చేసుకోవాలి. చిన్నారులు కనిపిస్తే ఇంట్లో సంపద పెరిగే అవకాశాలు ఉంటాయిన, వ్యాపారంలో వృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.
* ఇక మీకు నచ్చిన అమ్మాయి పదే పదే మీ కలలోకి వస్తుంటే మీరు వారిని చాలా మిస్ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మనం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తామో వారిపైనే మీ మనస్సు ఉంటుందనే విషయాన్ని మానసిక నిపుణులు చెబుతున్నారు.
* ఎదుటి వ్యక్తిపై మీకున్న ప్రేమ భావాలను వ్యక్తీకరించకుండా, భావాలను మీలోనే అణచేసుకుంటే కూడా వారు కలలో కనిపిస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో లభించిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




