AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ విజయానికి అడ్డుగా వచ్చేవి కేవలం మీ లోపాలు మాత్రమే.. వాటిని గుర్తించడంలో ఆలస్యం చేయకూడదు… చాణక్యుడు..

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో ఎన్నో విషయాలను పొందుపరిచాడు. మనుషుల స్వభావాలు.. వారికున్న లోపాలను వివరించాడు.

మీ విజయానికి అడ్డుగా వచ్చేవి కేవలం మీ లోపాలు మాత్రమే.. వాటిని గుర్తించడంలో ఆలస్యం చేయకూడదు... చాణక్యుడు..
Chanakya Neethi
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2021 | 12:53 PM

Share

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో ఎన్నో విషయాలను పొందుపరిచాడు. మనుషుల స్వభావాలు.. వారికున్న లోపాలను  వివరించాడు. అలాగే జీవన మార్గంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయాలను కూడా తెలిపాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. లోపం. ఒక వ్యక్తి విజయానికి తన లోపమే పెద్ద శత్రువుగా మారుతుందని చాణుక్యుడు చెప్పాడు.

ఒక వ్యక్తికి ఉండే అసూయ తన గమ్య స్థానానికి చేరుకోవడానికి అడ్డుగా మారుతుందని చాణుక్యుడు భావించాడు. ఇతరుల విషయంలో అసూయను పెంచుకోవడం అంటే.. నీ విలువను తగ్గించుకోవడమే అని చాణుక్యుడి విశ్వాసం. ఒక వ్యక్తిపై ఎప్పుడూ అసూయ పెంచుకునే వ్యక్తి తన లోపాలను గుర్తించలేడు. ఆ విషయాన్ని తాను కష్టపడి పనిచేసే సమయంలో మాత్రమే గుర్తించగలుగుతాడు. కానీ ఆ విషయం ఆలస్యంగా జరుగుతుంది. దీంతో మరో విషయం పై దాని ప్రభావం పడుతుందని చాణుక్యుడు చెబుతుంటాడు.

తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తన లోపాలు అడ్డువస్తున్న.. వాటిని కాదని.. లక్ష్యాన్ని చేరుకోవడానికి మనిషి అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. ఇందుకోసం అనేక రకాల తప్పుడు మార్గాలను ఎంచుకుంటాడు. వీటివలన మరింత ఇబ్బందులను ఎదుర్కోంటుంటాడు. అతడి జీవితం మరింత ఇబ్బందిగా మారుతుంది. అలాగే తన విలువైన సమయం, డబ్బు, మానసిక ప్రశాంతత వీటన్నింటిని పోగోట్టుకుంటాడు. ఇతరులను చూసి అసూయ పడే వ్యక్తి నిజంగా తనకు తానే హాని చేసుకుంటాడు. అతడు చేసే తప్పులే అతని విలువను తగ్గిస్తాయి. సమాజంలో గౌరవం పొందలేడు. కాబట్టి జీవితంలో విజయం సాధించాలి అంటే.. ఇతరులపై ఆసూయ పడడం.. చిరాకు తెచ్చుకోవడం తగ్గించి.. మీ లోపాలను గుర్తించడం మేలని చాణుక్యుడి భావన. నిజంగా.. విజయాన్ని సాధించిన వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండవు. అలాగే మీరు జీవితంలో ముందుకు సాగాలి అంటే ఆసూయను వదిలేయ్యాలి. దీనికి బదులుగా మరింత జ్ఞానాన్ని నేర్చుకోవడం అలవర్చుకోవాలని చాణుక్యుడు తన నీతి పుస్తకంలో ప్రస్తావించాడు.

Also Read:

వేసవి కాలం వచ్చేసింది.. భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి ఈ హెల్తీ టీ ఎంతో బేస్ట్.. చిటికెలో రెడీ..

ప్రియురాలి కోసం చంద్రుడినే ముక్కలు చేసాడు… అక్కడి వరకు ఎలా వెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు..

బాలయ్య న్యూలుక్ అదుర్స్.. బోయపాటి సినిమా కోసమే ఇలా మారాడా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!