బోర్లా పడుకుంటే ఆక్సిజన్‌ లెవల్స్ పెరుగుతాయా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అటు ఆసుపత్రులలో బెడ్స్ కొరతతో పాటు, ఆక్సిజన్

బోర్లా పడుకుంటే ఆక్సిజన్‌ లెవల్స్ పెరుగుతాయా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Oxygen Puls
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2021 | 4:54 PM

దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అటు ఆసుపత్రులలో బెడ్స్ కొరతతో పాటు, ఆక్సిజన్ అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు కరోనా పేషంట్స్. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత ఉన్న ప్రాంతాలకు ప్రాణవాయువు ట్యాంకర్ల పంపిణిని వేగవంతం చేసింది కేంద్రం. పలు రాష్ట్రాలకు ఇప్పటికే ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేసింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆక్సిజన్ కు ఎలా పెంచుకోవాలో తెలిపే వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ర‌క్తంలో ప‌డిపోయిన ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను సింపుల్‌గా ఇంట్లోనే ఎలా పెంచుకోవ‌చ్చో ఆ వీడియోలో చూపించాడు ఓ వ్యక్తి.

ఆ వీడియోలో.. ఓ వ్యక్తి నెలపై బోర్లా ప‌డుకొని ఛాతీపై బ‌రువు వేసి బ‌లంగా ఊపిరి పీల్చి వ‌ద‌ల‌డంతో ర‌క్తంలో ఆక్సిజ‌న్ లెవల్స్ పెరుగుతున్న‌ట్లు ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ద్వారా చూపించింది. కరోనా పేషెంట్లు ఇలా చేసి ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చా అనే సందేహాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మొదలయ్యాయి. అయితే ఇది నిజమే. కానీ ఇది కొత్తగా కనిపెట్టిన టెక్నిక్ కాదుూ. పాత పద్దతే అంటున్నారు మెడిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్. ఛాతీ, పొట్ట‌పై బ‌రువు వేసి లేదా..ప‌క్క‌కు ప‌డుకొని ఊపిరి పీల్చ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజ‌న్ అందుతుందని దీనినే ప్రోనింగ్ పొజిష‌న్ అంటారని నిపుణులు తెలిపారు. ఇది 2002లో యూరోపియ‌న్ రెస్సిరేట‌రీ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారని తెలిపారు.

ఆక్సిజ‌నేష‌న్‌ను పెంచ‌డానికి ఇది సుర‌క్షిత‌మైన పద్దతి అని నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస‌కోశ వ్యాధుల ప్రారంభ ద‌శ‌లో ఉన్న పేషెంట్ల‌లో ఈ విధానం ద్వారా 70 నుంచి 80 శాతం ఆక్సిజ‌నేష‌న్ పెరిగిన‌ట్లు ఓ అధ్య‌య‌నంలో నిరుపితమైంది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ ఇన్ఫ‌ర్మేష‌న్ చేసిన అవేక్ ప్రోనింగ్ అధ్య‌య‌నంలోనూ ఈ విషయం బయటపడింది. క‌రోనా వ‌చ్చినప్ప‌టి నుంచీ ప్రతీ ఇంటిలో ఈ ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లను వాడుతున్నారు. వీటి ద్వారా త‌మ ర‌క్తంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను చూసుకోవచ్చు. ఆక్సిజన్ లెవల్స్ 95 లోపు వ‌స్తే వెంటనే భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో వెంట‌నే ఆక్సిజ‌న్ కోసం ఉరుకులు ప‌రుగులు పెడుతున్నారు. ఆక్సిజ‌న్ స్థాయి 93 నుంచి 98 మ‌ధ్య ఉంటే ఆందోళ‌న అవ‌స‌రం లేదని కొందరు డాక్టర్లు సూచిస్తున్నారు. ర‌క్తంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచుకునేందుకు ఇళ్ల‌లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను పెట్టుకొని పీల్చడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 92 నుంచి 94 మ‌ధ్య ఉన్న వారు అధిక స్థాయిలో ఆక్సిజ‌న్ తీసుకోవాల్సిన అవ‌సరం లేదని.. ఆక్సిజన్‌ లెవల్స్ 92-94 మ‌ధ్య ఉంటే భ‌య‌ప‌డ‌కుండా డాక్ట‌ర్‌ను సంప్రదించి వారు ఇచ్చే సలహాలను పాటించడం మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఆక్సిజన్ లెవల్స్ 94 లోపు ఉంటే వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వీడియో..

Also Read: తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..