Unlucky Plants: ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పొరపాటున కూడా పెంచకండి.. కష్టాలను పెంచేస్తాయి..!

ఇంటి ఆవరణలో పాలు కారే, మొక్కలు, వృక్షాలు ఉండరాదని మీకు తెలుసా..? అలాంటిదే జిల్లేడు మొక్క కూడా. వినాయకుడిని పూజించటానికి వాడే తెల్ల జిల్లేడు శ్రేష్ఠం అనే భావనతో ఈ మొక్కను ఇటీవలి కాలంలో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. కానీ ఇలా పెంచకూడదు. అలాగే, ఇంటి ఆవరణలో ముళ్ల చెట్లు పెంచకూడదు. అలా పెంచితే ఏమౌతుందో తెలుసుకుందాం...

Unlucky Plants: ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పొరపాటున కూడా పెంచకండి.. కష్టాలను పెంచేస్తాయి..!
Unlucky Plants
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 26, 2024 | 9:41 PM

ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు పెంచుకోవాలో ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎలాంటి చెట్లు ఇంటి ప్రాంగణంలో ఉంటే ఎలాంటి లాభాలు పొందుతారో కూడా తెలిసే ఉంటుంది. అయితే, ఇంటి ఆవరణలో పాలు కారే వృక్షాలు ఉండరాదని మీకు తెలుసా..? అలాంటిదే జిల్లేడు మొక్క కూడా. వినాయకుడిని పూజించటానికి వాడే తెల్ల జిల్లేడు శ్రేష్ఠం అనే భావనతో ఈ మొక్కను ఇటీవలి కాలంలో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. కానీ ఇలా పెంచకూడదు. అలాగే, ఇంటి ఆవరణలో ముళ్ల చెట్లు పెంచకూడదు. అలా పెంచితే ఏమౌతుందో తెలుసుకుందాం…

ఇంట్లో చెట్లు, మొక్కలు నాటేటప్పుడు వాస్తు నియమాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఉండవు. అలాగే, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. తెల్లని పువ్వులతో ఉన్న జిల్లేడు చాలా అందంగా కనిపిస్తుంది. ఆ మొక్క పువ్వులను గణపతి పూజ, శివారాధనలో కూడా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఈ మొక్కను ఇంట్లో నాటడం మంచిది కాదు. ఈ మొక్క నుండి వెలువడే ప్రతికూల శక్తి కుటుంబానికి హానికరం. వాస్తవానికి, జిల్లేడు మొక్క తెలుపు రంగు ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది ప్రతికూలతను ఆకర్షిస్తుందని చెబుతారు. మీ ఇంటి ముందు ఇలాంటి జిల్లేడు మొక్క వెంటనే దాన్ని తొలగించండి. లేదంటే మీరు చేసే పనిలో వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో పాటు మీరు తలపెట్టిన పనులు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.

అలాగే, కొందరు తమ ఇంటి గార్డెన్‌లో, బాల్కనీలలో కాక్టస్ మొక్కలను పెంచుతుంటారు. వాటిని కొందరు అలంకరణగా కూడా భావిస్తుంటారు. కానీ, ఇంట్లో కాక్టస్ లేదా ఏదైనా ఇతర ముళ్ల మొక్కలను పెంచకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ ముళ్ల మొక్కలు ఇంటికి నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. కాక్టస్ ఉన్న ఇంట్లో కుటుంబీకులు కష్టాల బారిన పడతారు. మీకు కాక్టస్ మొక్కను నచ్చితే ఇంటి లోపల పెంచకూడదు, ఇంటి వెలుపల దీన్ని పెంచవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..