Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. నడిరోడ్డుపై కాన్వాయ్‌ని ఆపేసి మరీ.. ఏం చేసిందో తెలిస్తే..

నిత్యం పరిపాలనలో బిజీగా ఉండే మినిస్టర్ కొండ సురేఖ.. మానవత్వాన్ని చాటారు. చెప్పులు లేకుండా వెళ్తున్న ఓ చిన్నారిని చూసి చలించిపోయారు.. ఒక్కసారిగా కాన్వయ్ ఆపారు.. తరువాత ఆమె ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. నడిరోడ్డుపై కాన్వాయ్‌ని ఆపేసి మరీ.. ఏం చేసిందో తెలిస్తే..
Minister Konda Surekha
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 26, 2024 | 8:59 PM

Share

పెద్దపల్లి జిల్లా కు వెళ్తుండగా (బీహార్ కు చెందిన కూలీలు) తల్లిదండ్రులతో కలిసి ఓ చిన్నారి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తుండడాన్ని చూసి మంత్రి కొండా సురేఖ చలించి పోయారు. వెంటనే కారు ఆపి, ఆ చిన్నారిని చెప్పుల దుకాణంలోకి తీసుకెళ్లి, ఆ ఐదు సంవత్సరాల ఆ పాపకి చెప్పులు కొనిచ్చారు. అంతేకాదు, దగ్గరుండి ఆ పాపకి చెప్పులు కొనిచ్చారు. అంతేకాదు.. ఆ చిన్నారి చిరిగిపోయిన డ్రెస్ వేసుకుంది. దీంతో బట్టల షాపులోకి వెళ్లి.. ఆ పాపకు డ్రెస్సులు కొనిచ్చారు. ఆ తర్వాత పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

మీరు ఏ విధంగా అయితే చెప్పులు వేసుకుని నడుస్తున్నారో… మీ పాప కూడా అదే విధంగా చెప్పులు వేసుకుని నడవాలి…. పిల్లలకు కష్టం కలిగించొద్దని తల్లిదండ్రులకు హితవు పలికారు మంత్రి కొండా సురేఖ.

మంత్రి కొండ సురేఖ ఒకసారిగా కారు దిగడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మంత్రి సురేఖ పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం గ్రామం లోని కోదండ రామాలయంలో జరిగే ఒక కార్యక్రమానికి వెళుతూ కాలినడకన వెళ్తుండగా చెప్పులు లేకుండా కాలినడకతో వెళుతున్న ఆ పాపను చూసి మంత్రి సురేఖ ఒక్కసారిగా అక్కడే అగిపోయారు.

ఇవి కూడా చదవండి

సుల్తానాబాద్ లో 20 నిమిషాలు ఆ చిన్నారితో షాపింగ్ చేశారు. తనకు కవాల్సిన చెప్పులు, డ్రెస్సులు కొనివ్వడంతో స్థానికులు కొండా సురేఖ చేసిన మంచి పనిని పలువురు అభినందించారు… తరువాత చిన్నారి సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి