Viral video : ఈ చింపాంజీ చిన్న పిల్లల చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో..
నెట్టింట నిత్యం ఎన్నో వీడియోలు మనకు దర్శనమిస్తుంటాయి. ఇక జంతువులకు సంబంచిన వీడియోల గురించైతే చెప్పాలిసిన అవసరం లేదు. రోజులు వేల వీడియోలు
Viral video : నెట్టింట నిత్యం ఎన్నో వీడియోలు మనకు దర్శనమిస్తుంటాయి. ఇక జంతువులకు సంబంచిన వీడియోల గురించైతే చెప్పాలిసిన అవసరం లేదు. రోజులు వేల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. జంతువులకు మనుషులకు ఎంతో అవినాభావసంబంధం ఉంది.ప్రాణాలు తీసే మృగాలు కూడా ప్రేమ చూపిస్తే మనతో స్నేహంగా ఉంటాయి. ఇప్పటికే పులులు, సింహాలతో, ముసళ్ల వాటి వాటితో సావాసం చేసేవారు కూడా ఉన్నారు. ఇక మనుషులతో తొందరగా కలిసి పోయే జంతువుల్లో చింపాంజీలు ముందుంటాయి. వీటికి మనకు దగ్గర పోలికలతోపాటు, అలవాట్లు కూడా చాలా వరకు మనుషులను పోలి ఉంటాయి. ఇవి అచ్ఛం మనుషులు చేసే పనులే చేస్తూ నవ్వులు తెప్పిస్తుంటాయి.
ఇప్పుడు ఇక్కడ ఒక చింపాంజీ కూడా నవ్వులు పూయిస్తుంది. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఎంత మారం చేస్తారో తెలిసిన విషయం. ఇక వారు అడిగిన ఐస్ క్రీమ్ వారికీ కొనిస్తే ఎంతో ఆనందంతో దానిని ఆస్వాదిస్తూ తింటారు. ఇక్క ఈ చింపాంజీ కూడా అదే చేస్తుంది. చిన్న పిల్లలా ఐస్ క్రీమ్ ను తింటూ ఆ చింపాంజీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ చింపాంజీ చిన్న పిల్లల చేష్టలు మీరు చూడండి.