పీఎఫ్ ఖాతాదారులకు ప్రత్యేకం.. యూఏఎన్ నెంబర్ లేదా?.. మరేం పర్వాలేదు మీ ఖాతాలో బ్యాలెన్స్ ఎంతుందో ఇలా చెక్ చేసుకోండి..

Employers Provident Fund: దాదాపు ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ సౌలభ్యం ఉంటుంది. వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్‌...

పీఎఫ్ ఖాతాదారులకు ప్రత్యేకం.. యూఏఎన్ నెంబర్ లేదా?.. మరేం పర్వాలేదు మీ ఖాతాలో బ్యాలెన్స్ ఎంతుందో ఇలా చెక్ చేసుకోండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 08, 2021 | 7:30 PM

Employers Provident Fund: దాదాపు ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ సౌలభ్యం ఉంటుంది. వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్‌ క్రియేట్ చేసి వారి జీతం నుంచి కొంత మొత్తం కట్ చేసుకుని ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తాయి సంబంధిత సంస్థల యాజమాన్యాలు. ఇక యాజమాన్యం కూడా తమ తరఫున కొంత మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే, ఉద్యోగులు తమ ఉద్యోగం మానేసిన తరువాత పీఎఫ్‌ పొందడంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా యూఏఎన్ నెంబర్ లేకపోవడంతో పీఎఫ్ వివరాలు, బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవడానికి అవస్థలు పడుతుంటారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలతో పీఎఫ్ ఖాతాదారులు తమకు యూఏఎన్ నెంబర్ తెలియకపోయినా ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక ప్రాసెట్ అందుబాటులో ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపిఎఫ్‌ఓ) ఖాతాదారులు తమ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలంటే యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే, మొబైల్ అప్లికేషన్ అయిన ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్‌వో పోర్టల్‌తో యూఏఎన్ నెంబర్ అవసరం లేకకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వీటితోకాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా epfindia.gov.in హోమ్‌ పేజీలో ఉన్న ఈపీఎఫ్ ‌ఆప్షన్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తరువాత ఈపీఎఫ్ఓ సర్వీస్‌ పేజీ(epfoservices.in/epfo/) ఓపెన్ అవుతుంది. అక్కడ వినియోగదారులు ఈపీఎఫ్ బ్యాలెన్స్(మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి) విభాగంపై క్లిక్ చేయాలి. అక్కడ మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో అవసరమైన వివరాలు నమోదు చేయాలి. అంటే.. పీఎఫ్ ఖాతా నెంబర్, పేరు, రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. వివరాలు సరైనవి అయితే పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది.

పీఎఫ్ ఖాతాదారుల గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. Passbook.epfiindia.gov.in లో లాగిన్ అవ్వడం ద్వారా యూఏఎన్ నెంబర్ లేకుండా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఇక యూఏఎన్ యాక్టివేషన్ చేయించుకున్న ఫీఎఫ్ ఖాతాదారులు యూఏఎన్ యాక్టివేట్ అయిన 6 గంటల తరువాత మాత్రమే పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోగలుగుతారు.

Also read:

Women Reservation Bill: ఎట్టకేలకు మహిళా బిల్లుకు మోక్షం.. ఎంపీల డిమాండ్‌కు మోదీ ఓకే.. వర్షాకాలంలో గుడ్‌న్యూస్

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..