Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips: ఈ పంటను సాగు చేసి ఏడాదికి రూ.8 లక్షల లాభం.. ఆనందంలో రైతులు..

చాలా మంది పర్వాల్ వెజిటబుల్ తినడానికి ఇష్టపడతారు. ఇది ఏడాది పొడవునా మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. కానీ వేసవి కాలంలో ఎక్కువగా సాగు చేస్తారు. పర్వాల్ లాభం.. సాగు ఖర్చు కంటే చాలా రెట్లు ఎక్కువ. దీని అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ఒకసారి సాగు చేస్తే.. దాని నుండి 9 నెలల పాటు ఉత్పత్తిని పొందవచ్చు. ఈ కారణంగానే బీహార్‌లో రైతులు పెద్ద ఎత్తున పర్వాలు సాగు చేస్తున్నారు. దీని సాగు వల్ల చాలా మంది రైతుల ఆదాయం పెరిగింది.

Farming Tips: ఈ పంటను సాగు చేసి ఏడాదికి రూ.8 లక్షల లాభం.. ఆనందంలో రైతులు..
Parwal
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 14, 2023 | 10:01 AM

చాలా మంది పర్వాల్ వెజిటబుల్ తినడానికి ఇష్టపడతారు. ఇది ఏడాది పొడవునా మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. కానీ వేసవి కాలంలో ఎక్కువగా సాగు చేస్తారు. పర్వాల్ లాభం.. సాగు ఖర్చు కంటే చాలా రెట్లు ఎక్కువ. దీని అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ఒకసారి సాగు చేస్తే.. దాని నుండి 9 నెలల పాటు ఉత్పత్తిని పొందవచ్చు. ఈ కారణంగానే బీహార్‌లో రైతులు పెద్ద ఎత్తున పర్వాలు సాగు చేస్తున్నారు. దీని సాగు వల్ల చాలా మంది రైతుల ఆదాయం పెరిగింది.

పర్వాల్ సాగు వల్ల లబ్ధి పొందిన రైతు మయానంద్ విశ్వాస్ సక్సెస్ స్టోరీని ఇవాళ మనం తెలుసుకుందాం.. పర్వాల్ సాగుతో రైతు మయానంద్ ధనవంతుడయ్యాడు. పూర్నియా జిల్లాలోని కస్బా బ్లాక్‌లోని బనేలి సింధియా నివాసి అయిన మయానంద్.. తన గ్రామంలో 8 రకాల పర్వాల్ సాగు చేస్తున్నాడు. 2013 నుంచి పర్వాల్ సాగు చేస్తున్నాడు. ఒకసారి పర్వాల్‌ సాగు చేస్తే 9 నెలల పాటు కూరగాయలు ఉత్పత్తి అవుతాయి. దీని సాగులో లక్షల రూపాయల లాభం ఉంది.

గ్రామానికి వచ్చి పర్వాల్ సాగు ప్రారంభించారు..

రైతు మయానంద్ విశ్వాస్ మాట్లాడుతూ.. మనుషుల మాదిరిగానే కూరగాయలలో కూడా మగ, ఆడ జాతులు ఉన్నాయి. ఈ కారణంగానే గత 10 ఏళ్లుగా ఆడ, మగ రెండింటినీ కలగలిపి పర్వాల్‌ను పండిస్తున్నాడు. విశేషమేమిటంటే, పర్వాల్ సాగు ప్రారంభించే ముందు, అతను భాగల్‌పూర్‌లోని సబూర్ వ్యవసాయ పాఠశాల నుండి దాని గురించి పూర్తి సమాచారాన్ని తీసుకున్నాడు. అనంతరం గ్రామానికి వచ్చి పర్వాలు సాగు చేశాడు.

పర్వాల్ సాగుతో వచ్చిన లాభం ఇదీ..

ప్రస్తుతం ఒక ఎకరంలో పర్వాల్‌ సాగు చేశాడు రైతు మయానంద్. ఇందులో 8 రకాల పర్వాల్ ఉన్నాయి. రైతు మాయానంద్ విశ్వాస్‌ ఈ పర్వాల్ సాగుతో 9 నెలల్లో రూ.8 లక్షల లాభం పొందాడు. పూర్తి సమాచారం లేని కారణంగా చాలా మంది రైతులు పర్వాలు సాగు చేసేందుకు ఇష్టపడడం లేదని అంటున్నారు. దీని సాగులో కూడా చాలా మంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి రైతులు తమ పొలాల్లో మగ, ఆడ పర్వాల్ మొక్కలను నాటాలని, పర్వాల్‌ పొలంలో ఖాళీ స్థలాల్లో ఇతర పంటలు కూడా పండిస్తున్నట్లు చెప్పారు.

సాగు ఖర్చులు పోగా.. ఏడాదిలో రూ.8 లక్షల లాభం వస్తుందని చెబుతున్నాడు రైతు మయానంద్. ప్రస్తుతం పర్వాల్ ఆఫ్ రాజేంద్ర 2, స్వర్ణ అలోకిత్, రాజేంద్ర 1, స్వర్ణ రేఖ, దండారి, బెంగాల్ జ్యోతి, దుదయారి రకాలను రైతు మాయానంద్ విశ్వాస్ తన పొలంలో పండిస్తున్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..