AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టెడు దుఃఖంలోనూ ఆటోడ్రైవర్ కుటుంబం చూపిన ఔదార్యం.. ఆరుగురికి పునర్జన్మనిచ్చింది..!

ఇతరులకు సహాయం చేసే ఉన్నత గుణం కలిగిన ఉంటే చాలు.. బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా పరులకు సహాయం చేయవచ్చు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది.

పుట్టెడు దుఃఖంలోనూ ఆటోడ్రైవర్ కుటుంబం చూపిన ఔదార్యం.. ఆరుగురికి పునర్జన్మనిచ్చింది..!
Auto Driver Organ Donation
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 14, 2024 | 11:43 AM

Share

ఇతరులకు సహాయం చేసే ఉన్నత గుణం కలిగిన ఉంటే చాలు.. బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా పరులకు సహాయం చేయవచ్చు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. మరణించిన కొందరికి జీవం పోసి ప్రాణదాతగా నిలిచాడు. ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో జీవన్‌దాన్‌ ద్వారా అవయవాలను దానం చేయడంతో కొందరికి పునర్జన్మ లభించింది.

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన అశోక్‌ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆగస్ట్ 10వ తేదిన డీజే బాక్సుల కొనుగోలు కోసం బంధువులతో కలిసి నిజామాబాద్‌‌కు వాహనంలో వెళ్లారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. గజ్వేల్‌ సమీపానికి చేరుకోగానే వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనంలో వెనకాల కూర్చున్న అశోక్‌ కింద పడ్డాడు. తీవ్ర గాయాలు అయిన అశోక్ ను సికింద్రాబాదులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

రెండు రోజులపాటు చికిత్స అందించినప్పటికి అశోక్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో అశోక్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యులు, జీవదాన్ ట్రస్టు.. అతడి కుటుంబ సభ్యులకు అవయవ దానంపై ఆవశ్యకత, అవగాహన కల్పించారు. మరి కొందరికి ప్రాణదానం చేయాలనే లక్ష్యంతో అశోక్ కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకుని అవయవ దానానికి అంగీకరించారు. రెండు మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు తీసి జీవన్‌దాన్‌ ద్వారా నలుగురికి అమర్చారు.

తాను మరణించి ఆరుగురికి జీవం పోశాడు డ్రైవర్ అశోక్. అవయవ దానం స్వీకరించిన అనంతరం ఆసుపత్రి వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంద్రపాలనగరంలో అశోక్‌కు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. పుట్టెడు దుఃఖంలోనూ అశోక్ కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..