Putrada Ekadashi: పుత్రదా ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారు

పుత్రదా ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వ్యక్తి విష్ణువు ఆశీర్వాదం పొందుతాడు. పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ ఆగస్టు 15 ఉదయం 10.26 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి ఆగస్టు 16 ఉదయం 09:39 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతం ఆగస్టు 16న జరుపుకుంటారు.

Putrada Ekadashi: పుత్రదా ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారు
Putrada EkadashiImage Credit source: Pinterest
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2024 | 11:52 AM

పుత్రదా ఏకాదశి ఉపవాసం సంవత్సరానికి రెండుసార్లు ఆచరిస్తారు. అందులో ఒకటి శ్రావణ మాసంలో.. మరొకటి పుష్య మాసంలో జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షం, కృష్ణ పక్షం 11వ రోజున ఏకాదశి తిధి వస్తుంది. ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడిన పుత్రదా ఏకాదశిని జరుపుకోవడానికి విష్ణు భక్తులు రెడీ అవుతున్నారు. ఏకాదశిన భక్తులు పూజలు, ఉపవాసం మొదలైనవి చేస్తారు. ఈ రోజున ఉపవాసంతో పాటు దానధర్మాలు చేయాలని నమ్ముతారు. పుత్రదా ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వ్యక్తి విష్ణువు ఆశీర్వాదం పొందుతాడు.

పుత్రదా ఏకాదశి తిథి, సమయం

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ ఆగస్టు 15 ఉదయం 10.26 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి ఆగస్టు 16 ఉదయం 09:39 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతం ఆగస్టు 16న జరుపుకుంటారు.

ఆహరం వితరణ

పుత్రదా ఏకాదశి రోజున ఆహారం వితరణ చేయడం వలన మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆనందం, అదృష్టం పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

పసుపు దానం

జ్యోతిషశాస్త్రంలో పసుపును పవిత్రమైనది. పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పసుపును శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. శ్రావణ పుత్రదా ఏకాదశి రోజున పసుపును దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.

తులసి మొక్క దానం

శ్రావణ పుత్ర ఏకాదశి రోజున తులసి మొక్కను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభాలు అందుకుంటారు. జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని విశ్వాసం.

బట్టలు దానం

పుత్రదా ఏకాదశి రోజున వస్త్రదానం కూడా చేస్తారు. ఈ రోజున బట్టలు దానం చేయడం ద్వారా వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయి. జీవితంలోని పేదరికం కూడా తొలగిపోతుంది.

పుత్రదా ఏకాదశి రోజు దానం చేయడంలో ప్రాముఖ్యత

పుత్రదా ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తీరుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి శ్రీమహావిష్ణువుతో ప్రసన్నుడై సంతానం పొందుతాడని నమ్ముతారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని , పిల్లలు ఆరోగ్యకరంగా, సంతోషకరంగా ఉంటారని నమ్మకం. పుత్రదా ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు