Sandalwood Tree: ఆ ఊర్లో విశిష్ట సంప్రదాయం.. ఆడపిల్ల పుడితే ఇంట్లో చందనం మొక్కలు నాటే సంప్రదాయం.. ఎందుకో తెలుసా..
ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో చందనం మొక్కను నాటుతారు. ఇది ఆ గ్రామంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ అలవాటు బీహార్‌లోని ఒక గ్రామంలో ప్రజలు ఆడపిల్ల పుడితే చందనం చెట్టుని నాటే సంప్రదాయాన్ని పాటించడం మాత్రమే కాదు ఆ చెట్టును కూడా సంరక్షిస్తారు. కూతురు పెరిగి పెద్దయ్యాక ఆమె పేరు మీద నాటిన చందనం చెట్టును అమ్మి.. ఆ డబ్బులతో ఆ ఆడపిల్ల పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుతారు.

ఆడపిల్ల పుడితే కొందరు భారంగా ఫీల్ అయితే.. మరికొందరు మహాలక్ష్మి అంటూ సంతోష పడతారు. చిన్నారికి హారతి పట్టడమే కాదు భవిష్యత్ కోసం ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటారు. అయితే ఒక గ్రామంలో మాత్రం వింతైన సంప్రదాయం ఉంది. ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో చందనం మొక్కను నాటుతారు. ఇది ఆ గ్రామంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ అలవాటు బీహార్‌లోని ఒక గ్రామంలో ప్రజలు ఆడపిల్ల పుడితే చందనం చెట్టుని నాటే సంప్రదాయాన్ని పాటించడం మాత్రమే కాదు ఆ చెట్టును కూడా సంరక్షిస్తారు. కూతురు పెరిగి పెద్దయ్యాక ఆమె పేరు మీద నాటిన చందనం చెట్టును అమ్మి.. ఆ డబ్బులతో ఆ ఆడపిల్ల పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుతారు.
ఈ సంప్రదాయాన్ని బీహార్‌లోని వైశాలి జిల్లాలోని బిదుర్‌పూర్ లోని పకోలి అనే గ్రామంలో పాటిస్తారు. చాలా మంది గ్రామస్థుల ఇంటి వెలుపల నాటిన చందనం చెట్లను దర్శనమిస్తాయి. ఇదే విషయంపై గ్రామానికి చెందిన మీరాదేవి అనే మహిళ తమ గ్రామంలో సుమారు 700 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒకటి నుండి నాలుగు గంధపు చెట్ల కనిపిస్తాయి. కూతురి పుట్టినప్పుడు నాటిన చెట్టును అమ్మి.. కూతురు పెళ్లికి డబ్బులు లేకుంటే ఖర్చు పెడతారు.
కూతురు పుడితే శుభప్రదంగా భావించే గ్రామస్థులు
ఇంట్లో ఆడపిల్ల పుడితే ఎంతో పుణ్యప్రదంగా భావిస్తామని, చందన చెట్టును నాటడం కూడా ఎంతో పుణ్యప్రదమని తమ పూర్వీకులు చెప్పారని గ్రామంలోని మహిళ చెప్పింది. ఆడపిల్ల పుడితే చందన చెట్టును నాటడానికి కారణం ఇదే. ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే 5-6 నెలల తర్వాత చందనం మొక్కను నాటడంతో పాటు దానిని ఎవరూ దొంగిలించకుండా, హాని చేయకుండా కాపాడుకుంటూ ఉంటారు.




మనవరాలు పుట్టిన సందర్భంగా నాటిన మొక్క
ఈ సంప్రదాయం గురించి మరింత వివరిస్తూ మీరా దేవి తనకు మనవరాలు కొంత కాలం క్రితం జన్మించిందని.. ఆ తర్వాత తన మనవరాలి కోసం తమ ఇంటి ప్రాంగణంలో చందనం చెట్లను నాటినట్లు చెప్పారు. తమ ఆవరణలో బయట నాలుగు గంధపు చెట్లు నాటారు. ఇంతకు ముందు తన కూతురు పెళ్లి కూడా ఇలా నాటిన చందం చెట్లను అమ్మి.. అలా వచ్చిన డబ్బులతో పెళ్లి చేసినట్లు చెప్పింది. ఈ ఆచారం ఇప్పటిది కాదని.. ఎన్నో తరాలుగా తమ గ్రామంలో కొనసాగుతోందని చెప్పారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




