జనావాసం మధ్య భారీ వృక్షం… చెట్టుకు మొత్తంగా 200కు పైగా తేనెపట్లు.. ఎక్కడంటే
సాధారణంగా మనకు తెలిసి.. ఓ చెట్టుకు మహా అయితే రెండో, మూడో తేనెపట్లు కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టుకు మాత్రం వందల సంఖ్యలో తేనెపట్లు ఉన్నాయి.

సాధారణంగా మనకు తెలిసి.. ఓ చెట్టుకు మహా అయితే రెండో, మూడో తేనెపట్లు కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టుకు మాత్రం వందల సంఖ్యలో తేనెపట్లు ఉన్నాయి. ఈ చెట్టు కొమ్మలన్నీ తేనెలొలుకుతున్నట్లు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
జనసంచారం లేని అటవీ ప్రాంతాల్లో చెట్లకు తేనెపట్లు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. కానీ విశాఖపట్నంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని ఆర్వీనగర్ సమీపంలోని బాడిదపాకలు అనే గ్రామంలో జనావాసాలను ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు నిండుగా తేనెపట్లే ఉన్నాయి. ఎలా అంటే ప్రతి కొమ్మకూ పదుల సంఖ్యలో తేనెపట్లు ఉన్నాయి. ఇలా ఈ చెట్టుకు మొత్తంగా 200కు పైగా తేనెపట్లు ఉండటం విశేషం. ఆ తేనెపట్లు బరువుకు ఈ చెట్టు కొమ్మలన్నీ వంగిపోయి కనిపిస్తుంటాయి.