Komati reddy: తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బస్వాపూర్ ప్రాజెక్టు దగ్గర సరదాగా కాసేపు గడిపేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తీవ్ర..
Komati reddy: బస్వాపూర్ ప్రాజెక్టు దగ్గర సరదాగా కాసేపు గడిపేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులు ప్రాజెక్టులో మునిగి మృత్యువాత పడ్డం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ, నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఇలాఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు బస్వాపూర్ ప్రాజెక్టు వెళ్లి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు తన వంతు సహాయంగా ఒక్కో కుటుంబానికి 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు దగ్గర ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం ప్రమాదలకు నిలయంగా మారిందని వెంకటరెడ్డి అన్నారు. కనీసం సెక్యూరిటీ లేకపోవడంతో వల్లే పిల్లలు మరణించడం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరిన ప్రజా సంఘాలు.. రాజకీయ నాయకులను కూడా అరెస్టు చేయడం బాధాకరమని, ఈ విషయంలో ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.
Read also: Covid – 19: కరోనా ఎవరికి ఎక్కువ సోకుతోందన్న దానిపై కొత్త అధ్యయనంలో వింత విషయాలు.!