Covid – 19: కరోనా ఎవరికి ఎక్కువ సోకుతోందన్న దానిపై కొత్త అధ్యయనంలో వింత విషయాలు.!

ప్రపంచ మహమ్మారి కరోనా ఫలానా గ్రూపు రక్తం వారికి ఎక్కువగా సోకుతుందట..! ఫలానా వారికి చాలా తక్కువగా సోకుతుందట.. అని చాలాసార్లే..

Covid - 19: కరోనా ఎవరికి ఎక్కువ సోకుతోందన్న దానిపై కొత్త అధ్యయనంలో వింత విషయాలు.!
Corona
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 16, 2021 | 3:14 PM

Suryapet Medical College: ప్రపంచ మహమ్మారి కరోనా ఫలానా గ్రూపు రక్తం వారికి ఎక్కువగా సోకుతుందట..! ఫలానా వారికి చాలా తక్కువగా సోకుతుందట.. అని చాలాసార్లే విని ఉన్నాం. అయితే దీని శాస్త్రీయత గురించి తెలుసుకునేందుకు సూర్యాపేట మెడికల్‌ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారికి కరోనా వైరస్‌ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఒ’ బ్లడ్‌ గ్రూప్‌ వారికి కూడా ఎక్కువగానే సోకుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

ఈ అధ్యయనానికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ బ్రిటిష్‌ మెడికల్‌ మెడ్రివ్‌ జర్నల్‌ గుర్తింపు దక్కింది. కరోనా వైరస్‌ మొదటి, రెండు వేవ్‌ల సమయంలో సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో కొవిడ్‌ చికిత్స పొందిన 200 మంది రోగుల రక్త నమూనాలను పాథాలజీ వైద్య బృందం సేకరించింది.

సేకరించిన రక్త నమూనాలపై కాలేజీ ప్రిన్సిపాల్‌,  డాక్టర్‌ సీవీ శారద ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్, పాథాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ అనునయిల, పాథాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రావూరి స్వరూప పాల్గొన్నారు.

రేవన్ రెడ్డి, టీవీ9 ప్రతినిధి, నల్లగొండ