Independence day: నట్లు, బోల్టులతో పూజ్య బాపూజీ.. ఆకట్టుకుంటున్న అపురూపమైన శిల్పం..!

బ్రిటీష్ పాలన నుండి స్వేచ్చ వాయువులు ప్రసాదించిన గాంధీ మహాత్ముని గురించి భారతీయులందరికీ తెలిసిందే..! అయితే స్వాంతంత్ర్య దినోత్సవం రోజు ఆయన విగ్రహం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపూజీ ఎన్నో రకాల విగ్రహాలను భారతీయులందరూ చూసే ఉంటారు.

Independence day: నట్లు, బోల్టులతో పూజ్య బాపూజీ.. ఆకట్టుకుంటున్న అపురూపమైన శిల్పం..!
Gandhi Statue
Follow us
T Nagaraju

| Edited By: Balaraju Goud

Updated on: Aug 15, 2024 | 11:37 AM

బ్రిటీష్ పాలన నుండి స్వేచ్చ వాయువులు ప్రసాదించిన గాంధీ మహాత్ముని గురించి భారతీయులందరికీ తెలిసిందే..! అయితే స్వాంతంత్ర్య దినోత్సవం రోజు ఆయన విగ్రహం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపూజీ ఎన్నో రకాల విగ్రహాలను భారతీయులందరూ చూసే ఉంటారు. అయితే అరుదైన ఈ విగ్రహాన్ని మాత్రం ఇప్పుడు చూసి తీరాల్సిందే..!

తెనాలిలోని సూర్య శిల్ప కళాశాల రూపొందించిన విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది. రాట్నం తిప్పుతున్న గాంధీ రూపం అందరి మనోఫలకాలపై ఉంటుంది. అదే విధంగా రాట్నం తిప్పుతున్న విగ్రహం కూడా చాలా చోట్ల ప్రతిష్టించే ఉంటారు. అయితే తెనాలి శిల్పులు కాటూరి రవిచంద్ర, వెంకటేశ్వరావు రూపొందించిన తీరు అబ్బుర పరుస్తోంది.

ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీలో ఉపయోగించే నట్టులు, బోల్ట్‌లు, వాషర్‌లతో గాంధీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. దాదాపు రెండు నెలల పాటు శ్రమించిన శిల్పాలు మోడ్రన్ ఆర్ట్ లో భాగంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఒక బోల్ట్ పక్కన మరొకటి పేర్చి అన్నింటిని కలిపి విగ్రహాన్ని తయారు చేస్తారు. మిగతా శిల్పాలకు వేటికి తీసిపోని విధంగా ఈ విగ్రహం ఉండటంతో అందరూ స్వాతంత్ర్యదినోవత్సవ రోజు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

గతంలో కూడా భారీ అంబేద్కర్, మోడీ విగ్రహాలను ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీలో ఉపయోగించే నట్టులు, బోల్ట్ లు తో తయారు చేసినట్లు శిల్పి కాటూరి వెంకటేశ్వరావు తెలిపారు. గాంధీజీ విగ్రహాన్ని చేసిన వారంతా వెంకటేశ్వరావును ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..