AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన అద్భుతం

అది ఒక పురాతన ఆంజనేయ ఆలయం. ప్రస్తుతం శిథిలావస్తకు చేరుకుంది. దీంతో పునర్నిర్మాణం చేయాలని భక్తులు భావించారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించి తవ్వకాలు జరపుతుండగా....

Viral: ఆలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన అద్భుతం
Lord Vishnu Ancient Idol
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2022 | 10:48 AM

Share

Lord Vishnu ancient idol:  మన పురాతన శిల్పులు ఎలాంటి నైపుణ్యం కలవారో అరుదుగా బయపడే శిల్పాలు, పురాతన దేవుళ్లు, దేవతల విగ్రహాలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హమీర్‌పూర్ జిల్లాలోని ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాలలో పురాతన విష్ణువు విగ్రహం బయటపడింది. ఈ వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది.  పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకన్నారు. క్రమక్రమంగా, విగ్రహాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తుల రాక ప్రారంభమైంది.  గ్రామంలోని శ్రీరామ జానకి ఆలయం(Shri Ram Janaki temple)లో విగ్రహాన్ని భద్రంగా ఉంచారు. వివరాల్లోకి వెళ్తే.. హమీర్‌పూర్ జిల్లాలోని కురారా డెవలప్‌మెంట్ బ్లాక్ ఏరియా పరిధిలోని పతారా గ్రామంలోని అడవుల్లో ఒక చిన్న పురాతన హనుమాన్ దేవాలయం ఉంది. గ్రామస్థులు ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించిన తవ్వకాల్లో కూలీలకు దేవుడి విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని బయటకు తీసి కడిగి చూడగా అది విష్ణుమూర్తి విగ్రహమని తేలింది. గ్రామపెద్ద పాతర చందా దేవి  తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామం వెలుపల చాలా పురాతనమైన బజరంగబలి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో బుధవారం తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆ ప్రాంతలో కొంతమేర తవ్వగా చాలా పురాతనమైన, అరుదైన విష్ణువు విగ్రహం బయటకు వచ్చింది. దీనిని గ్రామస్తులు ఆలయంలో ప్రతిష్టించారు. విగ్రహం లభ్యమైన సమాచారాన్ని పురావస్తు శాఖకు అందించారు. విగ్రహం ఎత్తు సుమారు ఒక మీటరు ఉండగా, వెడల్పు అర మీటరు ఉంది.  ఈ అరుదైన విగ్రహం ఏ కాలానికి సంబంధించినది అన్న విషయంపై పురావస్తు శాఖ పరిశీలన జరపనుంది. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..