Viral: అంతా బాగానే ఉంది కానీ, అసలు ఎందికిలా.? ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యం..
తనకు ఆసక్తికరంగా కనిపించిన ప్రతీ అంశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంలో ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇందులో భాగంగానే రకరకాల వాహనాలు, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకోవడం ఈ వ్యాపారవేత్తకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోతో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జోడించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఆనంద్ మహీంద్రా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఉండే ప్రతీ ఒక్కరికీ ఈయన సుపరిచయమే. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువ మందికి పరిచయం. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సరే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటారు ఆనంద్ మహీంద్ర. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.
తనకు ఆసక్తికరంగా కనిపించిన ప్రతీ అంశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంలో ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇందులో భాగంగానే రకరకాల వాహనాలు, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకోవడం ఈ వ్యాపారవేత్తకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోతో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జోడించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఓ వ్యక్తి ట్రాక్టర్‌ను నడుపుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అందులో వెరైటీ ఏముందనేగా అయితే ఆ ట్రాక్టర్ సీటు సాధారణ సీటులా కాకుండా చాలా ఎత్తులో ఉంది. డ్రైవర్ ట్రాక్టర్ నుంచి సుమారు 7 అడుగుల ఎత్తులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. సీటును అడ్జెస్ట్ చేసుకునే విధంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.
ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్..
Interesting. But I have only one question: WHY? pic.twitter.com/Iee9NZC48E
— anand mahindra (@anandmahindra) November 17, 2023
ఈ వీడియో కాస్ ఆనంద్ మహీంద్ర కంటపడింది. ఇంకేముంది వెంటనే తన ట్విట్టర్ అకౌంట్‌లో వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోతోపాటు.. ‘చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నాకున్న ఒకే ఒక సందేహం, ఇలా ఎందుకు.?’ అంటూ రాసుకొచ్చారు. అసలు సీటును అంత ఎత్తులో ఎందుకు ఏర్పాటు చేశారన్న అర్థంలో ఆనంద్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..