AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: ఆలోచింపజేస్తున్న ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌.. పెరిగే కొద్ది మనం అహాన్ని పెంచుకుంటూ పొతున్నామంటూ..

Anand Mahindra Interesting Tweet: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది వ్యాపార వేత్తల్లో ఆనంద్‌ మహీంద్ర ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ. కోట్ల టర్నోవర్‌ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలో కూడా...

Anand Mahindra: ఆలోచింపజేస్తున్న ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌.. పెరిగే కొద్ది మనం అహాన్ని పెంచుకుంటూ పొతున్నామంటూ..
Narender Vaitla
|

Updated on: Feb 26, 2021 | 9:21 PM

Share

Anand Mahindra Interesting Tweet: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది వ్యాపార వేత్తల్లో ఆనంద్‌ మహీంద్ర ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ. కోట్ల టర్నోవర్‌ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలో కూడా నెటింట్లో సందడి చేస్తుంటాడీ వ్యాపార దిగ్గజం. కేవలం సరదగా ట్వీట్లు చేయడమే కాకుండా అప్పుడప్పుడు సమాజానికి అవసరమయ్యే, సమాజంలో విలువలను గుర్తు చేసే పోస్ట్‌లను సైతం చేస్తుంటాడు ఆనంద్‌ మహీంద్ర. ఈ క్రమంలోనే తాజాగా ఈ బిజినెస్‌ టైకూన్‌ చేసిన ఓ ట్వీట్‌ నెటిజెన్లను ఆలోచింపచేస్తోంది. మానవ పరిణామ క్రమంలో మనిషిని కోల్పోతున్న మానవత్వాన్ని, మరిచిపోతున్న బంధాలను గుర్తు చేసేలా ఉన్న ఈ ట్వీట్‌ తెగ ఆకట్టుకుంటోంది. ‘బర్నింగ్ మ్యాన్‌’ అనే కార్యక్రమానికి చెందిన ఒక కళాకృతితో కూడిన ఫొటోను ట్విట్టర్‌ షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర మానవుల్లో ఉన్న లోపాలను ఇది స్పష్టంగా చూపిస్తోంది అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనేగా మీ సందేహం..

ఇద్దరు యువతీ యువకులు వ్యతిరేక దిశలో కూర్చొని ఉండగా వారిలో ఉన్న చిన్నారులు మాత్రం ఒకరితో మరొకరు కలవాలని ఆతృతతో ఉంటారు. మహీంద్ర పోస్ట్ చేసిన ఫొటోపై.. ‘ఇద్దరిలో ఉన్న చిన్నారులు ఒకరితో ఒకరు కలవాలనుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మనం అనేక విషయాలను గెలుచుకుంటుంటాం. అలాగే అహంకారాన్ని, కోపాన్ని సైతం పెంచుకుంటూ పోతున్నాం. కానీ మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఎవరితోనూ విభేదాలు లేకుండా ఉండటం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకుండే క్షమాగుణం, స్వేచ్ఛా స్ఫూర్తి అదే మన అసలైన స్వభావం.. మీరు ఏదైనా విషయంలో మొండిగా వ్యవహరించాలని అనుకున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుచేసుకోండి’ అంటూ రాసి ఉంది. ఆనంద్‌ మహీంద్ర చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలువురు భావోద్వేగంగా ఫీలయ్యారు. మరికొందరు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే ఆనంద్‌ మహీంద్ర గతంలోనూ చేసిన కొన్ని ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అందులో కొన్ని ఫన్నీ ట్వీట్లు అయితే మరికొన్ని స్ఫూర్తిని నింపేవి ఉన్నాయి. ఆనంద్‌ మహీంద్ర ఇటీవలి కాలంలో చేసిన కొన్ని ట్వీట్లపై ఓ లుక్కేయండి..

Also Read: AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులంటూ వైరల్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

PAN CARD: మీరు ఇలా చేయకపోతే మీ పాన్‌ కార్డు రద్దు.. రూ.10 వేల జరిమానా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

House Tax In Telangana: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఇంటిపన్నును చెల్లించొచ్చు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న నిర్ణయం..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్