AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులంటూ వైరల్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మహారాష్ట్రలో ఈ ప్రమాదకరంగా విస్తరిస్తుంది. మిగతా రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ఒకపక్క ఈ మహమ్మారితో చస్తుంటే.. మరోవైపు ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు కొందరు

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులంటూ వైరల్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2021 | 9:22 PM

Share

AP Schools:  దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మహారాష్ట్రలో ఈ ప్రమాదకరంగా విస్తరిస్తుంది. మిగతా రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ఒకపక్క ఈ మహమ్మారితో చస్తుంటే.. మరోవైపు ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు కొందరు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా ఈ తరహా వైరల్ అవుతున్న వార్తలపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్.. ఈ అంశంపై స్పష్టత ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వార్తలు ఫేక్‌ అని, వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక ఇదే విషయంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా స్పందించారు. సదరు పోస్ట్ ఫేక్ అని ఎవరు వైరల్ చేయొద్దని కోరారు. ఈ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. స్కూల్స్ ఎప్పట్లానే నడుస్తాయని.. అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి వెల్లడించారు. జునియర్ కళాశాలలు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయని అటువంటి వార్తలను నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్…

ప్రభుత్వ పాఠశాలల నవీణీకరణ, పేద విద్యార్థులకు విద్యపై ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేకలు మార్చివేశారు. మరవైపు పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మనబడి, ‘నాడు-నేడు’ పనులు, విద్యాకానుకపై ఉన్నతాధికారులు, విద్యా శాఖ మంత్రితో ఇటీవల సీఎం జగన్‌ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 అకడమిక్ ఇయర్ నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి 1-7 తరగతులకు సీబీఎస్‌ఈసీ విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని.. అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పేదలకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం సీఎం ప్రధాన లక్ష్యాలని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది.

Also Read:

AP Grama/ward Volunteers: ఏపీలో వాలంటీర్లకు సత్కారం.. మూడు కేటగిరీలగా సెలక్షన్.. నగదు పురస్కారం ఎంతంటే..?

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో అనుమానాస్పద కారు.. అందులో పేలుడు పదార్థాలు.. తాజాగా మరో ట్విస్ట్…