నడి రోడ్డుపై ప్రసవాలు.. వాగు ఒడ్డున ప్రయాణాలు.. ఆదివాసీ బిడ్డల ప్రసవ వేదన..!

ప్రపంచమంతా కుగ్రామంగా మారుతున్న వేళ అడవుల జిల్లాలోని ఆదివాసీ కుగ్రామాలు మాత్రం ఇంకా నరక‌కూపాలుగా మారుతున్నాయి. వర్ష కాలం వచ్చిదంటే చాలు పొంగిపొర్లుతున్న వాగులు, అడుగు తీసి అడుగు వేయాలేని దారులు.. అంబులెన్స్ రాని రహదారులు.. అక్కడి తల్లుల పాలిట మృత్యు దారులవుతున్నాయి‌

నడి రోడ్డుపై ప్రసవాలు.. వాగు ఒడ్డున ప్రయాణాలు.. ఆదివాసీ బిడ్డల ప్రసవ వేదన..!
Tribal Problems (file)
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 29, 2024 | 10:49 AM

ప్రపంచమంతా కుగ్రామంగా మారుతున్న వేళ అడవుల జిల్లాలోని ఆదివాసీ కుగ్రామాలు మాత్రం ఇంకా నరక‌కూపాలుగా మారుతున్నాయి. వర్ష కాలం వచ్చిదంటే చాలు పొంగిపొర్లుతున్న వాగులు, అడుగు తీసి అడుగు వేయాలేని దారులు.. అంబులెన్స్ రాని రహదారులు.. అక్కడి తల్లుల పాలిట మృత్యు దారులవుతున్నాయి‌. రహదారి మార్గాలు లేక అంబులెన్స్‌లు రాక ఎడ్ల బండ్లే ఏర్ అంబులెన్స్‌లు అవుతున్నాయి. పురిటి నొప్పులతో నరకం చూస్తున్న గర్బిణిలను సమయానికి ఆస్పత్రులకు చేర్చే దారి లేక ప్రసవ వేదనను అంతంతకు పెరిగిపోతోంది. అదృష్టం ఉంటే నడి రోడ్డుపై ప్రసవం లేదంటే తల్లి బిడ్డా మరణం.. ఇది అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మారుమూల గ్రామాలలో వర్ష కాలం నిత్యం కనిపించే దృశ్యాలు. వాగులు దాటి సమయానికి ఆస్పత్రికి‌ చేరితే సరి.. లేదంటే తల్లి బిడ్డా ప్రాణాలు ఆ వాగు ఒడ్డునే గాల్లో కలవాల్సిన దుస్థితి. గర్భిణీల పాలిట శాపంగా మారుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నరకదారులు.

అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ ఏజేన్సీ గ్రామాలు నడక దారి కష్టాలతో నరక యాతన అనుభవిస్తున్నాయి. పొంగుతున్న వాగులతో నిలిచిపోతున్న రాకపోకల కారణంగా గర్భిణీలు, బాలింతలు మృత్యువుతో పోరాటం చేయాల్సిన దుస్థితిని‌ కలిపిస్తున్నాయి. స్వాతంత్ర్య వచ్చి 7 దశాబ్దాలు దాటి, తెలంగాణ రాష్ట్రం వచ్చి రెండు దశాబ్దాలు దాటినా.. ప్రభుత్వాలు మారినా పాలకులు మారుతున్న ఆదిలాబాద్ ఆదివాసీ గూడాల దుస్థితి మాత్రం మారడం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ‌ మండలం బావోజీపేట్ లో చోటు చేసుకున్న ఘటనే అందుకు సాక్ష్యం.

గత ఏడాది కురిసిన వర్షాలకి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేట్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కోతకు గురైంది. రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే రాకపోకలకు కష్టంగా మారింది. తాజాగా కురిసిన వర్షానికి ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన గిరిజన గర్భిణి వనితకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబం సిద్దమైంది. గ్రామంలోకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో భర్త గంగాధర్, ఆశా కార్యకర్త కళాబాయి కుటుంబ సభ్యుల సాయంతో ఎడ్ల బండిపై ఆస్పత్రికి తరలించారు. గతుకుల రోడ్డు కావడంతో మూడు కిలోమీటర్లు ప్రయాణించేందుకు గంటన్నర సమయం పట్టింది. సిరిచెల్మకు‌దారికి చేరుకోగానే స్థానికుల సాయంతో గర్భిణీ జీపులో ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. తీరా ఇచ్చోడ ఆస్పత్రికి తరలించాక.. నెలలు నిండలేదని వనితను వైద్య సిబ్బంది రిమ్స్ కు రెఫర్ చేశారు. ఒక్క వనితనే కాదు ఆదిలాబాద్ లోని 300 కు పైగా ఆదివాసీ మారుమూల గ్రామాల్లోని‌ గర్భిణుల పరిస్థితి ఇదే‌..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఉన్న 540 ఏజెన్సీ గ్రామాలలో 320 గ్రామాలు వాగుల కారణంగా ప్రతి ఏడాది వర్ష కాలం నరక యాతన తప్పడం లేదు ఆదివాసీ తల్లులకు. ప్రసవ వేదనను పంటి దిగువన భరిస్తూనే ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ ఆస్పత్రులకు చేరుతున్నారు గిరిజన తల్లులు. జిల్లాలోని 320 ఏజెన్సీ గ్రామాలకు వర్షాకాలం మొత్తం వనవాసం తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం మామిడిగూడ బీ, జీ గ్రామాలు అలాంటివే. వాగులు పొంగితే ప్రాణాలు కాపాడుకోవాలన్న.. వైద్యానికి అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి చేరాలన్నా దేవుడి మీద భారం వేసి వాగు ప్రవాహంలో అడుగులో అడుగేసి సాగడం తప్ప మరో మార్గం లేదు.

వాగులు దాటే దారులు లేక.. 108 లు వచ్చే మార్గం కనిపించక ఆదిలాబాద్ అడవుల్లో పురిటి నొప్పులతో అడవి తల్లులు అరగోస పడక తప్పడం లేదు. నడి రోడ్డుపై ప్రసవాలు, వాగు ఒడ్డున ప్రసవాలు.. ట్రాక్టర్లలలో తరలిస్తుండగా ప్రసవాలు ఇక్కడ నిత్యకృత్యమవుతున్నాయి. గత రెండేళ్ల క్రితం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన కొడిపె మల్లుబాయికి, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ(జి) గ్రామానికి చెందిన గర్భిణి ఉయిక గాంధారి.. కొమురంభీం జిల్లా పెంచికల్ పేట మండలం కమ్మర్ గాం పంచాయితీ పరిదిలోని నందిగాంలో తలండి సులోచన.. ఇలా ఈ మూడు ఘటనలతోనే ఆగిపోలేదు ఆదిలాబాద్ ఏజేన్సీలోని గిరిజన తల్లుల ప్రసవ వేదన కష్టాలు.

గత రెండేళ్లలో 48 కేసులు నమోదవగా.. అందులో 30 మంది నవజాత శిశువులు పుట్టగానే మృత్యవాత పడగా, నలుగురు తల్లులు మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచిన పరిస్థితి. వర్ష కాలం వచ్చిదంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ లో గర్భిణీలకు ఇవే ప్రసవ వేదనలు. వాగు నరకాన్ని దాటి సమయానికి ఆస్పత్రికి చేరితే తల్లి బిడ్డా ప్రాణాలతో బయటపడ్డట్టు లేదంటే నడి రోడ్డుపైనే నిండు నూరేళ్లు నిండినట్టే. ఇన్ని ఘటనలు చోటు చేసుకుంటున్న ఇక్కడి ప్రజాప్రతినిధులు మాత్రం స్పందించరు. ఇది ఏజెన్సీ ప్రజల దుస్థితి. ఉమ్మడి ఆ‌దిలాబాద్ ఏజెన్సీలో ఇంకెప్పుడు మాతృమూర్తులకు గర్భశోకం తీరుతుందో.. వాగు కష్టాలు దాటే ప్రసవ వేదన ఎన్నడు ఆగుతుందో.. రహదారి కష్టాలు తీరి అంబులెన్స్ లు గ్రామాలకు చేరి పురిటి కష్టాలు ఎన్నడు గట్టెక్కుతాయో చూడాలి..!

మరిన్ని హ్యమున్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!