AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tip: ఇంట్లో ఈ ఫొటో పెట్టుకుంటే తిరుగే ఉండదు.. వాస్తు ఏం చెబుతోందంటే..

ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో 7 గుర్రాలు పరిగెట్టే ఫొటోలు ఇంట్లో ఉండడం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గుర్రాలు పరిగెత్తడం జీవితంలో పురోగతికి చిహ్నంగా చెబుతుంటారు. అలాగే విజయం, బలానికి కూడా సింబాలిక్‌ అంటారు. అలాగే ఈ గుర్రాలు ఆర్థిక శ్రేయస్సును సూచిస్తుందని అంటున్నారు. అయితే ఈ ఫొటోను....

Vastu Tip: ఇంట్లో ఈ ఫొటో పెట్టుకుంటే తిరుగే ఉండదు.. వాస్తు ఏం చెబుతోందంటే..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Aug 25, 2024 | 10:56 AM

Share

మనలో వాస్తును విశ్వసించే వారు చాలా మందే ఉంటారు. భారతీయులను, వాస్తును విడదీసి చూడలేము. ఇంటి నిర్మాణం విషయంలో కచ్చితంగా వాస్తును ఫాలో అవుతుంటారు. ఇంటి పునాది మొదలు, ఇంట్లో గోడలకు వేసుకునే రంగుల వరకు ప్రతీ విషయం వాస్తుకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. వీటితో పాటు ఇంట్లో కొన్ని రకాల ఫొటోలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో 7 గుర్రాలు పరిగెట్టే ఫొటోలు ఇంట్లో ఉండడం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గుర్రాలు పరిగెత్తడం జీవితంలో పురోగతికి చిహ్నంగా చెబుతుంటారు. అలాగే విజయం, బలానికి కూడా సింబాలిక్‌ అంటారు. అలాగే ఈ గుర్రాలు ఆర్థిక శ్రేయస్సును సూచిస్తుందని అంటున్నారు. అయితే ఈ ఫొటోను గదిలో ఏర్పాటు చేసే దిశ కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. ఈ ఫొటోను ఏ దిశగా ఏర్పాటు చేస్తే, ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం 7 గుర్రాలు పరిగెడుతున్న ఫొటోను.. దక్షిణ దిశలో ఉండే గోడకు ఏర్పాటు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో ఫొటోను ఏర్పాటు చేసుకోవడం వల్ల కీర్తి, విజయం వరిస్తుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

* ఇక ఈ గుర్రాల ఫొటోను ఉత్తర దిశకు ఉన్న గోడకు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో ఫొటోను ఏర్పాటు చేసుకుంటే.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుందని అంటారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఫొటోను దుకాణాల్లో, ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో శుభప్రదమని చెబుతున్నారు.

* అన్నింటికంటే ముఖ్యంగా ఏడు గుర్రాలు పరిగెడుతున్న ఫొటోను తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవడం మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. వృత్తిపరంగా పురోగతి సాధించడంలో ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ దిశలో పెయింటింగ్స్ వేయడం పురోగతిని తీసుకొస్తోంది. పరిగెత్తే గుర్రం వేగానికి చిహ్నంగా పరిగణిస్తారు. స్టడీ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఏర్పాటు చేసుకోవడం మంచిదని అంటున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.