Rammandir with Coins: 20వేల నాణాలతో అద్భుత అయోధ్య రామ మందిరం.. భక్తిని చాటుకున్న సూక్ష్మ కళాకారుడు

అయోధ్య..ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం..కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేస్తున్నారు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు..

Rammandir with Coins: 20వేల నాణాలతో అద్భుత అయోధ్య రామ మందిరం.. భక్తిని చాటుకున్న సూక్ష్మ కళాకారుడు
Rammandi With Coins
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 21, 2024 | 10:04 PM

అయోధ్య..ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం..కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేస్తున్నారు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు..

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక వాతవరణం కనబడుతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వివిద రూపాల్లో భక్తలు రామభక్తిని చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తి పాటలు పాడుతున్నారు.

ఆ క్రమంలోనే రామ నామమే ప్రాణమని నమ్మిన రామ భక్తుడు వినూతన ఆలోచనతో అయోధ్య మందిరాన్ని రూపొందించారు. 20వేల నాణాలను ఉపయోగించి, 10అడుగుల పొడవు కలిగిన 8అడుగుల వెడల్పుతో అత్య అద్బుతంగా అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దారు. కేవలం మూడు రోజులు శ్రమించి భక్తితో చిత్రించి పూజలు జరిపి ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. రామ మందిర రూపకల్పనలో అన్ని రకాల నాణాలను ఉపయోగించినట్లు తెలిపారు.

మరోవైపు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట సందర్బంగా డేగకళ్లతో పోలీసులు నిఘా పెట్టారు. వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు NIA, యూపీ ATS సహా సైబర్‌ టీమ్స్‌ యాక్టివేట్ అయ్యాయి. జపాన్, అమెరికా టెక్నాలజీకి ధీటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటును చేశారు. సెక్యూరిటీ కోసం గరుడ డ్రోన్‌ను రంగం లోకి దింపారు. భద్రతతో పాటు భక్తుల రద్దీని కంట్రోల్‌ చేయడానికి కూడా ఈ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!