AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: మరికొన్ని గంటల్లో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట.. అయోధ్యలో నేటి కార్యక్రమ షెడ్యూల్‌.. ఇదే..

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉదయం 10 గంటలకు నిర్వహించే మంగళ ధ్వనితో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది. దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీ రాముడికి నీరాజనం అర్పించనున్నారు. న్యూఢిల్లీలోని కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో యతీంద్ర మిశ్రా సంగీత ప్రదర్శన జరుగనుంది.

Ayodhya: మరికొన్ని గంటల్లో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట.. అయోధ్యలో నేటి కార్యక్రమ షెడ్యూల్‌.. ఇదే..
Lord Ram Lalla
Surya Kala
|

Updated on: Jan 22, 2024 | 7:43 AM

Share

దేశమంతా రామ నామ స్మరణతో మారుమోగుతోంది. మరికొన్ని గంటల్లో శతాబ్దాల కల సాకారం కాబోతోంది. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశం మొత్తం ఆసక్తిగా భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం శుభ ముహర్తంలో గర్భ గుడిలో బల రాముడు కొలువుదీరనున్నాడు. ప్రధాన మంత్రి మోడీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ క్రమంలో.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌.. రామాలయం ప్రాణప్రతిష్టం షెడ్యూల్‌ ప్రకటించింది. అయితే .. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ షెడ్యూల్‌ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం..

అయోధ్యలో షెడ్యూల్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉదయం 10 గంటలకు నిర్వహించే మంగళ ధ్వనితో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది. దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీ రాముడికి నీరాజనం అర్పించనున్నారు. న్యూఢిల్లీలోని కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో యతీంద్ర మిశ్రా సంగీత ప్రదర్శన జరుగనుంది. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఉంటుంది.

యూపీ, ఒడిశా, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల సంగీత వాయిద్యాలతో రాముడికి నీరాజనం పలుకుతారు. ప్రాణ ప్రతిష్ఠకు దేశ విదేశాల నుంచి అతిథులు హాజరు కానున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం జారీ చేసే అడ్మిట్ కార్డు ద్వారా ఇప్పటికే అతిథులందరూ అయోధ్య రామమందిర కాంప్లెక్స్‌లోకి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక.. మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజీత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు. అభిజిత్ ముహూర్తం, ఇంద్రయోగం, మృగశిర నక్షత్రం, మేష లగ్నం, వృశ్చిక నవాంశలలో పౌషమాస ద్వాదశి తిథిలో ప్రాణప్రతిష్ట జరుగుతుంది.

కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు. 150కిపైగా సంప్రదాయాలు, 50కిపైగా గిరిజన, తీర, ద్వీపం, తదితర సంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖులు హాజరుకానున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..