Ayodhya శతాబ్దాల కల సాకారం కాబోతున్న సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామమందిరం

బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకతో అయోధ్య నగరం మెరిసిపోతోంది. అయోధ్య నగరంలోని చిన్న, పెద్ద ఆలయాలను కూడా అందంగా అలంకరించారు. ఈ క్రమంలోనే.. అయోధ్య రామమందిరాన్ని కూడా సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. అయోధ్య ఆలయాన్ని అలంకరించిన వివిధ రకాల పూలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Balaraju Goud

| Edited By: TV9 Telugu

Updated on: Jan 23, 2024 | 3:13 PM

అయోధ్య రామాలయం సప్తవర్ణాల శోభితంగా మారింది. అయోధ్య ఆలయంతోపాటు.. నగరమంతా అలంకరించిన రకరకాల పువ్వులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.

1 / 8
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ...దేశమే దేవాలయంగా మారిపోయింది. భక్త జనమే కాదు...ఆలయాలు కూడా అంతా రామ మయం అంటున్నాయి. సాయి నగరి షిర్డీ కూడా రామ నామ జపంతో ఊగిపోతోంది.

2 / 8
ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎక్కడ చూసినా జై శ్రీరాం అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది.

3 / 8
కోట్లాది మంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కన్పిస్తోంది. భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది.

4 / 8
ఆలయాన్ని పూర్తిగా విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాత్రి‌‍ళ్లు బంగారు వర్ణంలో గుడి వెలిగిపోతోంది. బయట గేటు దగ్గర కూడా పూలతో అలంకరించారు.

5 / 8
ప్రధాన రహదారి నుంచి గుడికి వెళ్లే దారిలో పది అడుగుల ఎత్తు వరకు పూలతో అలంకరించారు. రాముడితో పాటు వివిధ చిత్రాలను.. జైశ్రీరాం అనే పేరును కూడా పూలతో రూపొందించారు.

6 / 8
రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ శుభసందర్భం చరిత్రలో నిలిచిపోయేలాగా.. సంగీత కార్యక్రమం ‘మంగళ ధ్వని’తో పాటు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు.

7 / 8
జనవరి 23వ తేదీ నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.

8 / 8
Follow us