AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roasted Onion: వేయించిన ఉల్లిపాయలను ఒక్కసారి ట్రై చేయండి.. అది ఇచ్చే ప్రయోజనాలు తెలిస్తే వదలరుగా..

భారతీయుల వంటకాల్లో రుచిని పెంచడానికి ఉల్లిపాయను తప్పనిసరిగా వినియోగిస్తారు. ఉల్లిపాయ లేని వంటగది ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఉల్లిపాయను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ రోజు మనం కాల్చిన ఉల్లిపాయల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

Surya Kala
|

Updated on: Sep 15, 2022 | 9:07 PM

Share
Roasted Onion: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఓ సామెత.. నిజానికి ఉల్లిపాయలో అనేక ఔషధగుణాలున్నాయి. ఉల్లిపాయ మన ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తుంది. అంతేకాదు ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరానికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి ఉల్లిపాయ రసం మన జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. అయితే వేయించిన ఉల్లిపాయలు తినడం వల్లకూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ రోజు మనం వేయించిన ఉల్లిపాయ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1 / 5
విటమిన్లతో పాటు, కాల్షియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు వేయించిన ఉల్లిపాయలో ఉన్నాయి. వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.

2 / 5
కాల్చిన ఉల్లిపాయలను తినడం ద్వారా, కాల్షియం మన శరీరంలో అవసరమైన మొత్తంలో అందుతుంది. కాల్చిన ఉల్లిపాయను లేదా వేయించిన ఉల్లిపాయను తినడం వల్ల మన ఎముకలు దృఢంగా తయారవుతాయి. దీంతో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యలన నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
కాల్చిన ఉల్లిపాయలు మన జీర్ణవ్యవస్థకు కూడా చాలా మేలు చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. దీని వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

4 / 5
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కాల్చిన ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరం డిటాక్సిఫై అవుతుంది. కాల్చిన ఉల్లిపాయలు తినడం వలన శరీరంలోని విషపూరితాలను తొలగిస్తుంది. కాల్చిన ఉల్లిపాయలను సలాడ్‌గా కూడా ఉపయోగించవచ్చు.

5 / 5