AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Alert : పెంపుడు జంతువులకూ కరోనా సోకే అవకాశం ఉందని నిర్ధారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!

కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తూనే ఉంది. ఒకవైపు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. మరోవైపు కరోనా దానిపని అది చేసుకుంటూ పోతోంది.

Corona Alert : పెంపుడు జంతువులకూ కరోనా సోకే అవకాశం ఉందని నిర్ధారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!
Corona Alert
KVD Varma
|

Updated on: Apr 06, 2021 | 1:58 PM

Share

Corona Alert : కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తూనే ఉంది. ఒకవైపు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. మరోవైపు కరోనా దానిపని అది చేసుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటె కరోనా వైరస్ పై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కరోనా ఎలా పుట్టింది అనేదానిపై క్లారిటీ అయితే రాలేదు. కానీ, కరోనా వ్యాప్తికి సంబంధించి మాత్రం విస్తృత పరిశోధనలతో పలు విషయాలు బయట పడుతున్నాయి.

గతంలో కరోనా వైరస్ పెంపుడు జంతువులకు కూడా వ్యాపిస్తుందని కొందరు పరిశోధకులు చెప్పారు. అయితే, దానిపై అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)  ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ విషయం నిజమే అని చెబుతోంది. మానవులలో వచ్చిన కరోనా వైరస్ పెంపుడు జంతువులకు సోకె అవకాశం కచ్చితంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తోంది.

ఈ విషయంపై రష్యాకు చెందిన డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మెలిటా వుజ్నోవిక్ ప్రముఖ రష్యా పత్రిక స్ఫూత్నిక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలు చెప్పారు. మనుషుల నుంచి కరోనా వైరస్ పిల్లులు, కుక్కలు, మింక్స్ వంటి పెంపుడు జంతువులతో పాటు పులులు, సింహాలకు కూడా వ్యాపిస్తుందని చెప్పారు. 

”కోవిడ్ -19 వైరస్ ముఖ్యంగా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే, మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.” అన్నారు. మనుషుల నుంచి జంతువులకు వ్యాప్తి చెందటానికి సహకరించే విధానంపై ఇప్పటి వరకూ స్పష్టత లేదని కూడా ఆమె  వివరించారు.

కొన్ని జంతువులు వైరస్ సోకిన మనుషులకు దగ్గరగా మసలడం ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. వీటిలో కుక్కలు, పిల్లులు, పూలు, సింహాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ సోకిన జంతువుల్లో ఆ వైరస్ వలన వచ్చిన ఇబ్బందులు ఏమిటనే దానిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని మెలిటా వుజ్నోవిక్ చెప్పుకొచ్చారు. 

ఇక ఈ వైరస్ వ్యాప్తి జంతువులకు ఎలా జరుగుతుంది అనేది తెలిస్తే.. భవిష్యత్ లో వాటికి సోకకుండా చూసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కరోనా సోకిన వ్యక్తులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిదని ఆమె సూచించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో కరోనా సోకిన వ్యక్తులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది. సాధారణంగా వైరస్ లు మానవులు-జంతువులు మద్య ట్రాన్స్ మిట్ అయినపుడు జెనెటిక్ మార్పులు చెందుతాయి. అందువల్ల ఈ ట్రాన్స్ మిషన్ జరగకుండా జాగ్రత్త పడాలి అని సూచిస్తోందని ఆమె చెప్పారు.

Also Read: London: రొమ్ముక్యాన్సర్ బాధితులకు రెండున్నర గంటలు పట్టే చికిత్స ఐదు నిమిషాల్లోనే అంటున్న బ్రిటన్ వైద్యులు

Liver Diet: లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఒక్క వారం రోజులు ఈ ఆహార నియమాలు పాటించండి..