ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. ఒక్క రోజులోనే 6,43,042 కేసులు, 9,669 మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. ఒక్క రోజులోనే 6,43,042 కేసులు, 9,669 మరణాలు..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 13, 2020 | 6:58 PM

Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 6,43,042 పాజిటివ్ కేసులు, 9,669 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,233,097కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,301,818 మంది కరోనాతో మరణించారు. ఇక 37,313,271 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు..

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 10,873,936కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 248,585 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 8,729,190 కేసులు నమోదు కాగా.. 128,722 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక యూరోప్‌లో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

Also Read:

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..