Sirsasana Benefits: ఆసనాల్లో రాజు శీర్షాసనం..ఈ ఆసనం వలన ఎన్ని ఉపయోగంలో తెలుసా..!

Sirsasana Benefits: యోగా, వ్యాయామం మానసిక, శారీరక ప్రశాంతతను ఇస్తుంది. ఇక యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనా యోగ విద్య నభ్యసించ వచ్చును

Sirsasana Benefits: ఆసనాల్లో రాజు శీర్షాసనం..ఈ ఆసనం వలన ఎన్ని ఉపయోగంలో తెలుసా..!
Sirsasana Steps
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2021 | 11:37 AM

Sirsasana Benefits: యోగా, వ్యాయామం మానసిక, శారీరక ప్రశాంతతను ఇస్తుంది. ఇక యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనా యోగ విద్య నభ్యసించ వచ్చును. స్త్రీ, పురుషులు అనే బేధం కూడా లేదు.. కనుక చిన్నచిన్న వ్యాధికారాలను యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చు.. ఈరోజు ఆసనాల్లో రాజు వంటిది… శీర్షాసనం వేయి పద్దతి, ఉపగయోగాలు తెలుసుకుందాం..!

శీర్షాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. తలక్రిందులుగా అంటే.. తలను నేలపై ఆనించి కాళ్ళను పైకెత్తి చేసే ఆసనం కాబట్టి దీనికి శీర్షాసనమని పేరు. ఆసనాలలోకెల్ల ఉత్తమమైంది కనుక ‘రాజాసనం’ అని కూడా పిలుస్తారు.

పద్ధతి:

నేలపై పలుచని దూది పరుపును గాని, మెత్తని టవల్ ను గానీ నాలుగు మడతలుగా పరచి రెండు చేతులపై బరువు మోపి తల భాగాన్ని నేలపైన ఆనించాలి. రెండు కాళ్లను కలిపి మెల్లగా పైకి ఎత్తాలి. మోకాళ్లు, తరువాత రెండు కాళ్లు కలిపి మొల్లగా పైకి ఎత్తాలి. పిక్కలు, తొడలు, నడుము, వీపు నిటారుగా వుండాలి. కళ్లు మూసుకొని మొదట శీరాసనం పేయాలి. బరువు తలమీద తక్కువగాను, చేతుల మీద ఎక్కువగాను మోపాలి. శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఎత్తుతారో అంత జాగ్రత్తగా నెమ్మదిగా తిరిగి యథా స్థితికి తేవాలి కొద్దికాలం తరువాత మెల్లగా కాళ్ళు క్రిందికి దించాలి. ఈ ఆసనం తర్వాత పద్మాసనంలో తప్పని సరిగా విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనం

తలలో ఉన్న పియూష గ్రంధి, పీనియల్ గ్రంధులను ఉత్తేజపరచి, మిగతా గ్రంధుల సామర్ధ్యాన్ని పెంచడం వల్ల దేహంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తలలోని జ్ఞానేంద్రియా లన్నింటికి రక్తప్రసారం తగిన మోతాదులో లభించడం వలన అవన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తులకు, గుండెకు రక్తప్రసారం సక్రమంగా జరుగడం వల్ల అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఊపిరితితులు, గుండె బాగా పని చేస్తాయి. తెల్ల జుటు నల్లబడుతుంది. కంటి చూపు సరిగా వుంటుంది. స్మరణ శక్తి పెరుగుతుంది మధుమేహం, మూల శంక, వీర్యస్థలనం తగ్గి తేజస్సు పెరుగుతుంది

గమనిక: మొదట కళ్ళు ముసుకొని శీర్షాసనం అభ్యాసం చేయాలి. కళ్ళకు రక్తప్రసారం అధికంగా ఉండటం వలన అవి ఎర్రబడటానికి అవకాశం ఉంది. కన్ను చెవి జబ్బులు, రక్తపోటు, మెడ నొప్పి, స్పాండ లైటిస్ ఉన్నవారు శీరాసనం వేయకూడదు. శిరస్సుకు గాయం తగిలిన వారు, బలహీనంగా వున్నవాళ్లు యీ ఆసనం వేయకూడదు.

ఈ శీర్షాసనం అలవాటు అయ్యేవరకు ఇతరుల సాయంతో గాని, గోడ ఆధారంతో గాని వేయవచ్చు.

Also Read::: ఆ నదిలో నీరు 24గంటలు మరుగుతూనే ఉంటుంది.. నిప్పులేకుండా వంట రెడీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు