AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Health Benefits: పోషకాల నిధి.. చలికాలంలో ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

Benefits of Amla in the Winter Season: శీతాకాలం ప్రారంభమైంది. ప్రత్యేకించి ఈ సీజన్లో పలు రకాల వైరస్‌లు వ్యాపించడంతోపాటు అంటువ్యాధులు ప్రభలుతాయి. ఈ సీజన్‌లో పలు వ్యాధుల

Amla Health Benefits: పోషకాల నిధి.. చలికాలంలో ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు
Amla
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2021 | 2:04 PM

Share

Benefits of Amla in the Winter Season: శీతాకాలం ప్రారంభమైంది. ప్రత్యేకించి ఈ సీజన్లో పలు రకాల వైరస్‌లు వ్యాపించడంతోపాటు అంటువ్యాధులు ప్రభలుతాయి. ఈ సీజన్‌లో పలు వ్యాధుల నుంచి బయటపడేందుకు ముఖ్యంగా ఉసిరికాయను తీసుకోవడం చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఈ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలు.. జుట్టు రాలడం, ఎసిడిటీ, బరువు పెరగడం, ఇతర సమస్యలకు చెక్‌పెడుతుంది. కావున చలికాలంలో ఉసిరికాయ తినడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోషకాల ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: చలికాలంలో ఉసిరికాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఉసిరికాయతో చేసిన చ్యవన్‌ప్రాష్ తినడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సాధారణ శీతాకాల సమస్యలను దూరం చేస్తుంది. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాటంతోపాటు మీ శరీరాన్ని బలంగా చేస్తుంది.

మలబద్ధకం నుంచి ఉపశమనం: శీతాకాలంలో మలబద్ధకం సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఉసిరికాయ మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను బలంగా మారుస్తుంది. ఉదరం సంబంధిత అనేక సమస్యలను నివారించడంలో ఉసిరి కీలకంగా వ్యవహరిస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: శీతాకాలంలో జుట్టు రాలడం తీవ్రమవుతుంది. అయితే ఉసిరి జట్టు రాలడాన్ని అరికట్టి బలంగా మారుస్తుంది. ఆమ్లాలోని పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

ఉసిరికాయను ఎలా తినాలంటే:

  • మీరు చలికాలంలో ఉసిరి పొడిని తీసుకోవచ్చు. ఒక చెంచా ఉసిరి పొడిని వేడి నీటిలో, తేనెలో కలపి తాగాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
  • ఉసిరి రసం కూడా తీసుకోవచ్చు. ఒక చెంచా ఉసిరి రసాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలపి తాగాలి.
  • మీరు ఉసిరికాయ పచ్చడి లేదా మురబ్బాను కూడా తినవచ్చు. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
  • ఆమ్లా మిఠాయిని కూడా తయారు చేసుకొని తినవచ్చు. దీని కోసం ఉసిరికాయను చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బెల్లం పాకాన్ని కలిపి ఆమ్లా మిఠాయిని తయారు చేసుకోవచ్చు.

Also Read:

Jaggery: బెల్లం ఎక్కువగా తింటున్నారా? అది ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని తెలుసా? ఎలాగంటే..

Benefits of Rose: గులాబీలు అందానికే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఎలా అంటే..