Winter Tips: చలికాలం వచ్చేసింది.. చలితో బద్ధకంగా..నీరసంగా అనిపిస్తోందా? వీటిని తీసుకోండి.. వెచ్చదనం మీ సొంతం అవుతుంది!
చలికాలం వచ్చిందంటే శరీరం బద్ధకంగా, నీరసంగా మారుతుంది. నిదానంగా ఉండడం వల్ల ఏ పని చేయాలని అనిపించదు. దీనితో పాటు, ఈ సీజన్‌లో వ్యాయామం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అదనపు శక్తి ఉత్పత్తి కాదు. శరీరంలో వేడి కూడా ఉత్పత్తి కాదు.
Winter Tips: చలికాలం వచ్చిందంటే శరీరం బద్ధకంగా, నీరసంగా మారుతుంది. నిదానంగా ఉండడం వల్ల ఏ పని చేయాలని అనిపించదు. దీనితో పాటు, ఈ సీజన్‌లో వ్యాయామం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అదనపు శక్తి ఉత్పత్తి కాదు. శరీరంలో వేడి కూడా ఉత్పత్తి కాదు. చలికాలపు ఈ బద్ధకాన్ని ఆహారంతో తప్ప మరే ఔషధంతోనూ భర్తీ చేయలేమని చెబుతారు నిపుణులు. వారు చెబుతున్న దాని ప్రకారం శరీర ఉష్ణోగ్రత తగ్గడంతో, జీవక్రియ కూడా మందగించడం ప్రారంభిస్తుంది. శరీరం వేడిని సమతుల్యం చేయడంలో జీవక్రియ సహాయపడుతుంది. చలికాలంలో మీకు వెచ్చదనాన్ని అందించే కొన్ని ఆహారపదార్థాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యితో దగ్గు-జలుబులను దూరంగా ఉంచండి
చలికాలంలో నెయ్యి తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందని డైటీషియన్స్ చెబుతున్నారు. నెయ్యిలో వేడిని ఇచ్చే కొవ్వు ఉంటుంది. దీనితో పాటు, నెయ్యి ఇన్ఫెక్షన్, కీళ్ల నొప్పులు, దగ్గు-జలుబును కూడా నివారిస్తుంది. ఇది చర్మం మెరుపుకి కూడా చాలా మంచిదని భావిస్తారు. అయితే ఇందుకు ఆవు పాలతో నెయ్యి తయారు చేసుకోవాలి. ఉదయం 1 టీస్పూన్ నెయ్యి తీసుకోండి. ఇది మన శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది.
డ్రై ఫ్రూట్స్, నట్స్..
డ్రై ఫ్రూట్స్, నట్స్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి కూడా మేలు చేస్తాయి. బాదం వేడిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం కూడా. బాదంపప్పులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అల్లం రక్త ప్రసరణను నిర్వహిస్తుంది
అల్లం ఇప్పటి నుంచి కాదు అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఇంటివైద్యం. అల్లం అనేక వ్యాధులకు ఔషధంగా పరిగణినిస్తారు. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్త ప్రసరణను సమతుల్యం చేస్తుంది. అల్లంను పచ్చిగా తీసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. అల్లం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. కఫం, జలుబును కూడా దూరం చేస్తుంది.
తులసి అనేక వ్యాధులకు ఔషధం
తులసికి మతపరమైన, ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. శ్వాసకోశ మార్గాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులను దూరం చేస్తాయి. శరీరం వాపును తగ్గిస్తుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. అలాగే, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
అదనపు కొవ్వు కట్టర్స్ నల్ల మిరియాలు..
నల్ల మిరియాలు, పసుపు, దాల్చినచెక్క శరీరాన్ని వెచ్చగా ఉంచే సుగంధ ద్రవ్యాలు. దాల్చిన చెక్కలో శరీర ఉష్ణోగ్రతను నిర్వహించే గుణాలు ఉన్నాయి. ఇది వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ మసాలా దినుసులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా అదనపు కొవ్వు కట్టర్లు కూడా. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుండిచి మంటను తొలగిస్తాయి.
నువ్వుల లడ్డు జీవక్రియను సమతుల్యం చేస్తుంది..
నువ్వులు ఇనుము, కాల్షియం లోహాలకు మంచి మూలంగా చెబుతారు.నువ్వులతో లడ్డూలు తిన్నా, నూనె రాసుకున్నా రెండూ మేలు చేస్తాయి. ఇందులో ఉండే సహజ నూనెలు అదనపు కొవ్వును తగ్గిస్తాయి. ఇది జీవక్రియను కూడా సమతుల్యంగా ఉంచుతుంది. శరీరాన్ని వేడి చేయడంలో నువ్వులు చాలా మేలు చేస్తాయి.
విటమిన్ సి అధికంగా ఉండే మిరపకాయలు
భారతీయ ఆహారంలో ప్రధాన భాగమైన మిరపకాయ కూడా ఆరోగ్యాన్ని నింపుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచే విటమిన్ సి కి సంబంధించిన మంచి మూలం. రక్త ప్రసరణ, మరియు పొట్ట రెండూ చక్కగా ఉంటాయి.
బెల్లంతో కావలసినంత ఐరన్..
బెల్లంతో ఐరన్ ఎక్కువ లభిస్తుంది. దీని వల్ల శరీరంలో రక్తానికి లోటు ఉండదు. అలాగే రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. మీరు దీన్ని ఏ రకమైన చిక్కీ, బెల్లం చీలా లేదా టీలో అయినా తీసుకోవచ్చు. పంచదారకు బదులు బెల్లం తింటే శరీరం వెచ్చగా ఉంటుంది.
చక్కెరకు తేనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం
చక్కెరకు తేనె మంచి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. దీన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. ఆహారంలో చేర్చుకోవడం ద్వారా దగ్గు-జలుబు నుంచి కాపాడుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్‌గా ఉండటం వల్ల వేడిని ఉత్పత్తి చేసి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
చలికాలంలో శరీరం నీరసంగా మారి చర్మం పొడిబారుతుంది. ఈ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థలు చక్కగా ఉంటాయి. అలాగే శరీరం వెచ్చగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Facebook Profile: ఫేస్‌బుక్ లో మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలని ఉందా? ఇలా చేయండి.. చాలు!
PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే..