Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harmful Chicken: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..! వీటిని అస్సలు తినకూడదు..?

చికెన్ తినడంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చికెన్ లో కొన్ని భాగాలు తింటే అనారోగ్య సమస్యలు కలగవచ్చు. చికెన్ లో ఈ 4 భాగాలను అస్సలు తినకండి. తింటే చాలా డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు. బీ కేర్ ఫుల్

Harmful Chicken: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..! వీటిని అస్సలు తినకూడదు..?
Chicken
Follow us
Prashanthi V

|

Updated on: Jan 24, 2025 | 6:00 PM

చికెన్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా ఆదివారం చికెన్ లేకుండా గడపడం కొందరికి అసాధ్యం. ఇది అందుబాటులో ఉండే నాన్ వెజ్ ఆహారాల్లో అందరూ ఇష్టపడేది. కానీ చికెన్ లో కొన్ని భాగాలను తినడం మన ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడి మెడ

చాలామంది కోడి మెడ భాగాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ భాగంలో కోడి శోషరస వ్యవస్థ ఉంటుంది. శోషరస వ్యవస్థ శరీరంలోని వ్యర్థాలు, బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంది. ఈ విషతుల్య పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదం ఉంది. ఈ భాగాన్ని తింటే, వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు మన శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలను కలిగించవచ్చు. అందుకే కోడి మెడను తినకూడదు.

కోడి తోక

కోడి తోక భాగం గురించి కొందరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ భాగం చాలా హానికరమైన క్రిములు, బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది. ఈ క్రిములు తిన్న వెంటనే శరీరంపై ప్రభావం చూపకపోవచ్చు, కానీ ఆ తరువాత ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి కోడి తోక భాగాన్ని తినకుండా వదిలేయడం మంచిది.

కోడి మొప్పలు

చికెన్ మెడ, తోకతో పాటు, కోడి మొప్పలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కోడి మొప్పల్లో ఆహారం జీర్ణమయ్యే భాగాలు ఉంటాయి. ఈ భాగంలో క్రిములు, హానికరమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. ఈ క్రిములు మన శరీరానికి ప్రమాదం కలిగించే అవకాశముంది. అందువల్ల కోడి మొప్పలను తినడం పూర్తిగా మానేయండి.

కోడి ఊపిరితిత్తులు

కోడి ఊపిరితిత్తులు కూడా తినకూడని మరో భాగం. ఈ భాగంలో క్రిములు, వైరస్‌లు అధికంగా ఉంటాయి. ఇవి తింటే శరీరానికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. కాబట్టి ఈ భాగాన్ని తినకూడదు. సాధారణంగా చికెన్ శరీరానికి పోషకాలను అందించగల అద్భుతమైన ఆహారం. కానీ ఏ భాగాలు తినాలి, ఏవి వద్దు అన్నదానిపై దృష్టి పెట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం.