AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barley Water Benefits: బార్లీ వాటర్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

బార్లీ వాటర్ ఆరోగ్యకరమైన డ్రింక్ అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా మధుమేహ రోగులకు అనుకూలంగా ఉంటుందట. అలాగే బార్లీ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో, శక్తిని పెంచడంలో ఉపయోగంగా ఉంటుంది. మొత్తానికి బార్లీ ఆరోగ్యానికి మేలు చేసే రోజువారీ రీఫ్రెష్ డ్రింక్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Barley Water Benefits: బార్లీ వాటర్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
బరువు తగ్గడానికి బార్లీ నీరు ఒక సహజ నివారణ. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, కడుపు చాలా సేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. కేలరీలు తీసుకోవడం నియంత్రణలో ఉంచుతుంది. అలాగే, ఇది జీవక్రియను పెంచుతుంది, తద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బార్లీ నీరు జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Prashanthi V
|

Updated on: Jan 24, 2025 | 7:26 PM

Share

బార్లీ వాటర్ ఆరోగ్యకరమైన శరీరానికి మంచి డ్రింక్. ఇది శరీరానికి రిఫ్రెష్ ఫీలింగ్ కలిగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహ రోగుల కోసం బార్లీ వాటర్ తాగడం చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవనానికి చాలా అవసరం.

గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం

బార్లీ నీటిలో పుష్కలంగా ఉండే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర లెవెల్స్ ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తుంది. శాస్త్రవేత్తల అధ్యయనాలు బార్లీ వాటర్ తాగే వారిలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లు నిర్ధారించాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి బార్లీ వాటర్ మంచి చేస్తాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, గ్లూకోజ్ సమతులతను కాపాడుతుంది.

విషపదార్థాల తొలగింపు

బార్లీ నీరు శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని మూత్రవిసర్జన లక్షణాలు శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలను బయటకు పంపడంలో కీలకమైనవి. బార్లీ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండటంతో ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

కోలెస్ట్రాల్ నియంత్రణ

బార్లీలో టోకోఫెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ పెరగడాన్ని నిరోధిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, శరీరానికి అవసరమైన పుష్టికరమైన పదార్థాలను అందించడంలో సహాయపడుతుంది. బార్లీ వాటర్ కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మాత్రమే కాకుండా.. హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడంలో సహాయం

బార్లీ వాటర్ తాగడం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ గుణాలు శరీరంలో కొవ్వు తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది శరీరానికి అవసరమైన నీటిశాతం కల్పించడం ద్వారా రోజువారీ శక్తిని కూడా అందిస్తుంది.

తయారీ విధానం

బార్లీ వాటర్ తయారు చేయడం చాలా సులభం. బార్లీని బాగా కడిగి, ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చాక వడగట్టండి. ఆ తర్వాత నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తాగడం చాలా మంచిది. బార్లీ వాటర్ ఆరోగ్యకరమైన, సహజమైన రోజువారీ డ్రింక్ అంటున్నారు వైద్య నిపుణులు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)