Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న యంగ్ గా.. అమ్మ కొంచెం ఏజ్ అయినట్లుగా ఎందుకు కనిపిస్తారు..?

మన తల్లిదండ్రుల వయస్సు ఒకటే ఉన్నప్పటికీ.. తల్లిలో వయోవృద్ధి లక్షణాలు తొందరగా కనిపించడం మీరు గమనించారా..? ఇది పూర్తిగా తల్లిదండ్రుల తప్పు కాదు. నిపుణులు చెబుతున్నట్లుగా మహిళలలో ముందుగా వచ్చే మెనోపాజ్ కారణంగా శరీరంలో వయోవృద్ధి ప్రక్రియ వేగంగా సాగుతుంది. హార్మోన్ల అసమతుల్యతలు, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ వయస్సులో ఈ మార్పులు త్వరగా కనిపించొచ్చు.

నాన్న యంగ్ గా.. అమ్మ కొంచెం ఏజ్ అయినట్లుగా ఎందుకు కనిపిస్తారు..?
Aging In Women
Follow us
Prashanthi V

|

Updated on: Jun 09, 2025 | 11:12 PM

40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు తగ్గడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా శరీరాన్ని త్వరగా బలహీనపరిచే కారకాలు.

చాలా మంది మహిళలు చాలా సంవత్సరాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, గర్భధారణ సమయంలో పోషకాలు తగ్గిపోవడం లాంటి కారణాలతో హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటారు. అందువల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడం చాలా ముఖ్యం. పోషణ నిపుణులు, ఫిట్‌ నెస్ కోచ్‌ లు, వైద్యులు ఈ వయసులో ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు.

మెనోపాజ్ ముందు లేదా తర్వాత ఉన్న మహిళలకు శరీర బరువుకు అనుగుణంగా రోజుకు 5 నుంచి 10 గ్రాముల వరకు ప్రోటీన్ అవసరం. ఇది ఎముకల బలాన్ని, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా మూత్రపిండాల సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యం, ఎముకల బలం కోసం విటమిన్ E, C, D, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 లాంటి పోషకాలు తీసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకి పొద్దుతిరుగుడు గింజలు, బాదం, కీర దోస, క్యాప్సికమ్, బ్రోకలీ, నారింజ, టమాటా లాంటి ఆహారాల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పెరుగు, పనీర్, కేఫిర్, మజ్జిగ, ఇడ్లీ లాంటివి ఆరోగ్యకరమైన పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం అరుగుదల వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే యాంటీబయాటిక్స్ వల్ల నాశనం అయిన మంచి బ్యాక్టీరియాను తిరిగి పెంచడానికి ఇది సహాయపడుతుంది.

ఈ వయసులో అధిక రక్తపోటు ఎక్కువగా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. టేబుల్ ఉప్పు తక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాలు, కొత్తిమీర లాంటి సహజమైన మసాలా పదార్థాలు ఉపయోగించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది.

వారానికి కనీసం మూడు రోజుల పాటు బలం పెంచే వ్యాయామాలు చేయడం, యోగా, నడక లాంటి వ్యాయామాలు చేయడం వయసును నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం, మానసిక ఆరోగ్యం కోసం కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సూచనలను పాటించడం వల్ల మీ తల్లి ఆరోగ్యంగా, సంతోషంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)